వనమహోత్సవం లక్ష్యం అధిగమించాలి | - | Sakshi
Sakshi News home page

వనమహోత్సవం లక్ష్యం అధిగమించాలి

Aug 21 2026 9:56 AM | Updated on Aug 21 2026 9:56 AM

కోల్‌సిటీ: వర్షాలు విస్తారంగా కురుస్తున్న దృష్ట్యా నగరంలో త్వరితగతిన మొక్కలు నాటి వనమహోత్సవ లక్ష్యం అధిగమించాలని అదనపు కలెక్టర్‌, రామగుండం మున్సిపల్‌ కమిషనర్‌ అరుణశ్రీ ఆదేశించారు. రామగుండం మున్సిపల్‌ కార్యాలయంలో వార్డు అధికారులతో బుధవారం వనమహోత్సవం నిర్వహణపై ఆమె సమీక్షించారు. ఈ వర్షాకాలం సీజన్‌లో నాలుగు లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

చేయూతకు హెల్ప్‌డెస్క్‌లు

చేయూత పింఛన్ల అర్హుల జాబితా రూపొందించడానికి ఈనెల 31తో గడువు ముగియనున్నందున డివిజన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి, సందేహాలు తీ ర్చడంతోపాటు దరఖాస్తులు స్వీకరించాలన అరుణ శ్రీ అన్నారు. వాటిని నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా దరఖాస్తులు స్వీకరించాలన్నారు.

ఆస్తిపన్ను వసూలుకు భువన్‌ ప్రక్రియ

ఆస్తిపన్ను వసూలు మెరగుపర్చడానికి భువన్‌ ప్రక్రియను పూర్తిచేయాలని కమిషనర్‌ ఆదేశించారు. నీటిబిల్లుల ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ కూడా త్వరితగతిన పూర్తిచేయాలని అన్నారు. అనుమతి లేని కట్టడాలు, నిబంధనలు ఉల్లంఘించిన నిర్మాణాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. డిప్యూటీ కమిషనర్‌ వెంకటస్వామి, ఏసీపీ శ్రీహరి, కార్యదర్శి మహేశ్వర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

4 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలి

చేయూతకు డివిజన్లలో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు

అధికారులను ఆదేశించిన మున్సిపల్‌ కమిషనర్‌ అరుణశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement