పెద్దపల్లిరూరల్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌పై రెండురోజులుగా కొనసాగుతున్న సదస్సు బుధవారం ముగిసింది. ఇంటర్ నోడల్ అఽధికారి కల్పన హాజరై పలు సూచనలు చేశారు. మూడువిడతల్లో నిర్వహించిన కార్యక్రమాల ద్వారా అన్ని సబ్జెక్టులపై అవగాహన కల్పించామని కల్పన తెలిపారు. కోర్సు డైరెక్టర్ రవీందర్‌రెడ్డి, అకడమిక్ ప్రతినిధి శంకరయ్య, రాయికల్, జగిత్యాల ప్రిన్సిపాల్స్ నిర్మల, నాగభూషణం తదితరులు ఉన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
గోదావరిఖనిటౌన్: నగరంలో గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ స రఫరా నిలిపివేయనున్నారు. లక్ష్మీనగర్‌లోని రాహు ల్ ఆస్పత్రి ఏరియా, పాత గ్రామపంచాయతీ కార్యాలయం పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామ ని ట్రాన్స్‌కో ఈస్ట్ ఏఈ జమీల్ పాషా తెలిపారు.


