మంథనిలో చెక్కు అందిస్తున్న మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీ వంశీకృష్ణ, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, గర్రెపల్లిలో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రులతోపాటు విప్ విజయరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి: రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు భారీ గా కేటాయిస్తోందని, తద్వారా పరిశ్రమలు, వ్యాపారాలు విస్తరించడంతోపాటు యువతకు ఉపాధి అ వకాశాలు మెరుగుపడతాయని రోడ్లు, భవనాల శా ఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సుల్తానాబాద్‌లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో ఉమ్మ డి కరీంనగర్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ప్రభు త్వ విప్ విజయరమణారావు, కలెక్టర్ కోయ శ్రీహ ర్ష, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్‌తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చే శారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మా టాడుతూ, రోడ్లను రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు. హైదరాబాద్ నుంచి రామగుండం వరకు గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణంపై కేంద్రమంత్రితో చర్చలు జరిపామని, సుల్తానాబాద్ బైపాస్‌ను కూడా మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో విజయవంతంగా ముందుకు వెళ్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. రోడ్ల విస్తరణకు ప్రభుత్వం భా రీగా నిధులు వెచ్చిస్తోందని ఐటీమంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పెద్దపల్లిలో 1,10,000 మెట్రిక్ టన్ను ల నిల్వసామర్థ్యంగల గోదాములు నిర్మాణమే ల క్ష్యంగా పనిచేస్తున్నామని ప్రభుత్వ విప్ విజయరమ ణారావు అన్నారు. నాబార్డు ఎండీ లక్ష్మి, అదనపు క లెక్టర్ శ్రీరాములు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, సుల్తానాబాద్, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్లు రాధాకృష్ణ, నూగిళ్ల మల్లయ్య, గోదావరిఖని డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్లు మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. సభలో జేబుదొంగలు కలకలం సృష్టించారు.
గర్రెపల్లి – పెగడపల్లి రోడ్డుకు శంకుస్థాపన
సుల్తానాబాద్‌రూరల్: సుల్తానాబాద్ మండలం గర్రె పల్లి – కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లి వర కు రూ.99,69 కోట్లతో చేపట్టిన రోడ్డు నిర్మాణానికి మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. సర్పంచ్ వీరగొని రమేశ్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ జానీ, మాజీ ప్రజాప్రతినిధులు పడాల అజయ్‌గౌడ్, పులి వెంకటేశంగౌడ్ పాల్గొన్నారు.
మంథని అభివృద్ధికి మరో రూ.800 కోట్లు
మంథని: మంథని అభివృద్ధికి మరో రూ.800 కోట్లు మంజూరు చేసినా తక్కువేనని మంత్రి తుమ్మల నా గేశ్వరరావు అన్నారు. గంగాపురి వద్ద రూ.20 కోట్ల తో న్యాక్ సెంటర్ తదితర పనులకు మంత్రులు కోమటిరెడ్డి, శ్రీధర్‌బాబు, ఎంపీ వంశీకృష్ణ, కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌తో కలిసి మంత్రి నా గేశ్వర్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో రేషన్‌కార్డులు, చెక్కులు, కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. తుమ్మల మాట్లాడు తూ, శ్రీపాదరావుతో కలిసి పనిచేసే అవకాశం తన కు లభించిందన్నారు. ఈ ఏడాది నాణ్యమైన ఇందిరమ్మ చీరలు అందిస్తున్నామని తెలిపారు. మరోమంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, దేశఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన మహనీయుడు పీవీ నరసింహారావు, అజాతశత్రువు శ్రీపాదరావు అని కొనియాడా రు. ఐటీమంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, మంథనిలో మౌలిక వసతుల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామ న్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మున్సిపల్ చైర్మన్ వొడ్నాల శ్రీనివా స్, వైస్ చైర్మన్ సహేందర్‌రెడ్డి, రామగుండం మేయ ర్ స్వామి, డిప్యూటీ మేయర్ ఎల్లయ్య, విద్యుత్ శా ఖ సలహాదారు కాచే శశిభూషణ్ పాల్గొన్నారు.
రోడ్లు, భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


