రామగిరి: పన్నూర్‌లోని మంథని జేఎన్టీయూ లో కంప్యూటర్ సైన్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 36 గంటల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి హ్యాకథాన్ కార్యక్రమం బుధవారం వి జయవంతంగా ముగిసింది. మొత్తం 45 టీంల్లో 188 మంది, బయటి కళాశాలల నుంచి 45 మంది విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కళాశాల ఆవరణలో ఆన్‌లైన్ పద్ధతి లో జరిగిన హ్యాకథాన్‌లో ఏఐ అండ్ డేటాసై న్స్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిస్టర్ మేనేజ్‌మెంట్, హెల్త్‌కేర్, ఎనర్జీ, స్మార్ట్ సిటీ, వ్యవసాయం, పర్యావరణం, మైనింగ్ అండ్ సిద్దీ ప్రాజెక్టులను విద్యార్థులు సమర్పించారు. ఇందులో అత్యుత్తమ ప్రాజెక్టును సమర్పించిన మంథని జేఎన్టీయూ విద్యార్థుల రెస్క్యూవిజన్ ప్రాజెక్టుకు ప్రథమ. ఏఐ–పవర్డు ఇన్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ యూజింగ్ మల్టీ కెమెరా వీడియో అనాలిటిక్స్ ప్రాజెక్టుకు ద్వితీయ, పెద్దపల్లి మ దర్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల అగ్రికల్చర్ కనెక్ట్ ప్రాజెక్టుకు తృతియ బహుమతులు లభించాయి. ముఖ్య అతిథిగా హాజరైన ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ ప్రతిభావంతులను అభినందించి నగదు పారితోషికం అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ఎం.ఉద య్ కుమార్, కన్వీనర్ ఎ.తిరుపతి, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్లు కె.శ్రీనివాస్‌రావు, ఎన్.వంశీకృష్ణ, వి.నవ్య, స్టూడెంట్ కో ఆర్డినేటర్లు ఎన్.సాయిశ్రీజ, ఎం.వికాస్ తదితరులు పాల్గొన్నారు.
ఓదెల మల్లన్నకు పూజలు
ఓదెల: ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో శ్రావణమాసం సందర్భంగా బుధవారం భక్తులు పూజలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు వివిథ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఎత్తిపోతలు నిలిపివేత
రామగుండం: ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఎత్తిపోతలు నిలిపివేశారు. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది. నీటిపారుదల శాఖ అధికారులు బుధవారం విడుదల చేసిన నివేదిక మేరకు.. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం 15.70 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 2,624 క్యూసెక్కులు ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా.. ప్రస్తుతం 146.33 మీటర్లకు చేరింది.
ప్రకృతి వ్యవసాయం చేయాలి
మంథనిరూరల్: ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలని ఏడీఏ అంజనీమిశ్రా సూచించారు. సూరయ్యపల్లి రైతు వేదికలో ఆత్మ ఆధ్వర్యంలో నూనెగింజలు, ప్రకృతి వ్యవసాయం, కిచెన్ గార్డెనింగ్‌పై కేవీకే శాస్త్రవేత్త వినోద్‌తో కలిసి ఆమె బుధవారం రైతులకు అవగాహన కల్పించారు. త క్కువ నీరు.. స్వల్పకాలిక పంటలను సాగు చే యాలని చెప్పారు. కృత్రిమ ఎరువుల వినియో గం తగ్గించాలని, కూరగాయలు, ప ప్పుదినుసులు సాగు చేయాలని వివరించారు. మండల వ్యవసాయాధికారి నవ్య పాల్గొన్నారు.
నేడు వాహనాలకు వేలం
పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్: గుడుంబాను తరలిస్తుండగా సీజ్ చేసిన ఐదు ద్విచక్రవాహనాలను గురువారం జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో వేలం వేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు తెలిపారు. ఉదయం 10 గంటల్లోగా డిపాజిట్ చెల్లించి 11గంటల నుంచి మొదలయ్యే బహిరంగ వేలం పాటలో పాల్గొనవచ్చని వివరించారు. పూర్తివివరాల కోసం ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు.


