పెద్దపల్లి: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ జిల్లాలో వేగంగా సాగుతోంది. ఇంటింటా సర్వే చేస్తున్న బీఎల్‌వోలు.. ప్రతీ ఓటరును కలుసుకుని వివరాలు ధృవీకరించుకుంటున్నారు. మరణించి, శాశ్వతంగా వలస వెళ్లిన, ఒకటికన్నా ఎక్కువచోట్ల ఓటుహక్కు కలిగి ఉన్నవారి వివరాలు గుర్తించి ఓటరు జాబితా నుంచి తొలగించే చర్యలు చేపడుతున్నారు.
తల్లిగారింటి వద్ద తొలగింపులు..
వివాహానంతరం అత్తగారింటి వద్ద ఓటుహక్కు నమోదు చేసుకున్న మహిళల విషయంలో తల్లిగారి ఇంటి వదకద ఓటును తొలగిస్తున్నారు. ఉపాధి కోసం వల సవచ్చి జిల్లాలో నివసిస్తున్న వారు తమ ఓటు ఎక్కడ కొనసాగించాలనుకుంటున్నారో తెలుసుకుని నమోదు చేస్తున్నారు. వెరి ఫికేషన్ పూర్తయ్యాక అర్హులైన వారిపేర్లతోనే తుది ఓటరు జాబితా సిద్ధం చేయనున్నట్లు ఎన్ని కల అధికారులు తెలిపారు.
స్వగ్రామాల్లో నమోదు చేసుకునేలా..
ప్రభుత్వ ఉద్యోగులు స్వగ్రామాల్లోనే ఓటుహక్కు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నారు. విధులు నిర్వర్తిస్తున్న ప్రాంతాల్లో ఓటు నమోదు చేసుకోవడంతో గ్రామాల్లో ఓటర్ల సంఖ్య తగ్గుతున్నట్లు అధికారులు గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
సింగరేణి ఉద్యోగులపై ప్రత్యేక దృష్టి
పెద్దపల్లి నియోజకవర్గానికి చెందిన సింగరేణి ఉద్యోగులు గోదావరిఖని, రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, మంచిర్యాలతోపాటు కాగజ్‌నగర్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో కొందరికి ఉద్యోగ ప్రాంతంతోపాటు స్వగ్రామంలోనూ ఓటు నమోదై ఉండటాన్ని బీఎల్‌వోలు గుర్తిస్తున్నారు. ఆధార్ అనుసంధాన ప్రక్రియలో భాగంగా వారు ఓటును ఏ ప్రాంతంలో కొనసాగించాలనుకుంటున్నారో వివరాలు సేకరిస్తున్నారు. దీంతో డబుల్ ఓట్ల తొలగింపుతోపాటు గ్రామాల్లో ఓటర్ల సంఖ్యలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.
రెండేసి ఓట్లు చట్టవిరుద్ధం
ఒక వ్యక్తికి ఒకేచోటే ఓటుహక్కు ఉండా లని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తున్నా రు. సొంతూరు, ఉద్యోగ ప్రాంతాల్లో రెండుచోట్ల ఓటరుగా నమోదు చేసుకోవడం చట్టవిరుద్ధమని హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు స్వచ్ఛందంగా ఒక ఓటును తొలగించుకోవాలని సూచిస్తున్నారు.
రెండేసి ఓట్లకు చెక్


