సమస్యల్లో ఠాణా | - | Sakshi
Sakshi News home page

సమస్యల్లో ఠాణా

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రమైన పెద్దపల్లిలో 2025 జూన్‌ 13న సీఎం రేవంత్‌రెడ్డి మహిళా పోలీస్‌స్టేషన్‌తోపాటు ట్రాఫిక్‌, పెద్దపల్లి రూరల్‌, ఎలిగేడు ఠాణాలను ప్రారంభించిన విషయం విదితమే. ఠాణాలు ఏర్పాటయ్యాయి అంతే.. ఇప్పటివరకు పాలనాపరమైన అనుమతులు మాత్రం మంజూరు కాదు. పోలీస్‌ అధికారులు, సిబ్బందిని కూడా పూర్తిస్థాయిలో నియమించలేదు. వీరిలో దాదాపు చాలామంది డిప్యుటేషన్‌పైనే విధులు నిర్వర్తిస్తున్నారు.

రూ.29 లక్షలతో తాత్కాలిక షెడ్డు, టాయిలెట్లు

కుటుంబ తగాదాలతో స్టేషన్‌ను ఆశ్రయిస్తున్న మహిళలు కనీస సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. వాటిని దూరం చేసేందుకు ప్రభు త్వ విప్‌ విజయరమణారావు సూచనతో కలెక్టర్‌ ప్రత్యేక నిధుల్లోంచి రూ.29 లక్షలు వెచ్చించారు. వీటితో షెడ్డు, టాయిలెట్లు నిర్మించారు. తద్వారా బాధిత మహిళలకు ఊరట కలిగినట్లయ్యింది.

డిప్యుటేషన్‌పైనే విధులు

కొత్తగా ఏర్పాటైన మహిళా ఠాణాతోపాటు ట్రాఫిక్‌, రూరల్‌, ఎలిగేడు పోలీసుస్టేషన్లకు అవసరమైన పో లీస్‌ అధికారులు, సిబ్బంది నియామక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. ప్రజాసేవలకు ఆటంకం కలుగకుండా వీలుగా పోలీస్‌ అఽధికారులు, సిబ్బందిని డిప్యుటేషన్‌పై నియమించారు. మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐగా రమేశ్‌బాబును ఎస్‌బీ నుంచి కేటాయించారు. ఈయనతోపాటు మరో ముగ్గురు ఎస్సైలు (ఇందులో ఒకరు ప్రసూతి సెలవులో ఉన్నారు), ముగ్గురు ఏఎస్సైలు, 8మంది కానిస్టేబుళ్లు, ఓ హెడ్‌కానిస్టేబుల్‌ సేవలు అందిస్తున్నారు. వీరితోనే పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు.

ఏడాదిలో 1,550 ఫిర్యాదులు

జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి ఏ డాదిలో 1,550 వరకు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. ఇందులో భార్యాభర్తల గొడవలు, కుటుంబ తగాదాలు ఉన్నాయి. వీటిలో 190 కేసులు నమోదు చేసిన అధికారులు.. మిగతా కేసుల్లో కౌన్సెలింగ్‌ ఇచ్చి నచ్చజెప్పి పంపించారు. ప్రతీరోజు మహిళా పోలీస్‌స్టేషన్‌ ప్రాంతం దంపతుల మధ్య ఏర్పడ్డ అభిప్రాయ భేదాలు, తగదాలను పరిష్కరించేందుకు వచ్చే కుటుంబీకులు, వారి పెద్దమనుషులతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది.

ఏడాదిలో 1,550 ఫిర్యాదులు

నమోదైనవి 190 కేసులు

తరలివస్తున్న బాధితులు

డిప్యుటేషన్‌పై అధికారులు

ఫిర్యాదుదారులకు తప్పని తిప్పలు

రెగ్యులర్‌ సిబ్బందిని నియమించాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement