న్యూస్‌రీల్
ఒకేరోజు.. నాలుగు చోరీలు
కరీంనగర్, వేములవాడలో రెండు చొప్పున ఘటనలు
తుపాకీతో బెదిరించి.. బంధించి నగరంలో అర్ధరాత్రి భారీ దోపిడీ
54 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.25 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, రెండు బైక్‌లు అపహరణ
పట్టపగలే తాళం వేసిఉన్న ఇంట్లోంచి రూ.4.80 లక్షల నగదు..
వేములవాడలో బైక్‌నుంచి 3 నిమిషాల్లో రూ.3.50 లక్షలు మాయం
జాతర గ్రౌండ్‌లో ఆరు షాపుల్లో విలువైన వస్తువులు ఎత్తుకెళ్లిన దొంగలు
దొంగల బీభత్సం
ఉమ్మడి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పీఎంజే జువెల్లరీ దోపిడీ మరవక ముందే గంటల వ్యవధిలో కరీంనగర్, వేములవాడలో హల్‌చల్‌చేశారు. మంగళవారం అర్ధరాత్రి కరీంనగర్‌లోని భగత్‌నగర్‌లోని ఓ ఇంట్లో దుందగులు చొరబడి కుటుంబ సభ్యులను డమ్మీ తుపాకీతో బెదిరించారు. ఆపై బంధించి పెద్ద చోరీకి పాల్పడ్డారు. రూ.25 లక్షల నగదు, 54 తులాల బంగారం, 30 తులాల వెండి, రెండు ఖరీదైన సెల్‌ఫోన్లు ఎత్తుకెళ్లారు. ఇంటి ఎదుట పార్క్‌చేసిన రెండు బైక్‌లను తీసుకుని పరారయ్యారు. ఈ వాహనాలను బుధవారం పోలీసులు హుజూరాబాద్ పరిసరాల్లో గుర్తించారు. మరో ఘటనలో నగరంలోని వావిలాలపల్లి తులసీనగర్‌లో మధ్యాహ్నం ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు రూ.4.80 లక్షలు దొంగలించారు. ఇదే రోజు రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడలో మూడు నిమిషాల్లో రూ.3.50 లక్షలు చోరీకి గురయ్యాయి. బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టిన డబ్బులను నిమిషాల్లో మాయం చేశారు. ఆంధ్ర–తమిళనాడు సరిహద్దులోని తల్లగడ ప్రాంతానికి చెందిన అంతర్‌రాష్ట్ర దొంగల ముఠా పనేనని పోలీసులు అనుమానిస్తున్నారు. జాతరగ్రౌండ్‌లో కూడా దుండగులు హల్‌చల్ చేశారు. మూసివేసి ఉన్న ఆరు డేరాషాపుల్లోరాత్రిచోరీకి పాల్పడ్డారు.
– కరీంనగర్ క్రైం/వేములవాడ – వివరాలు 8లోu


