మడేలయ్యస్వామి బోనాలు | - | Sakshi
Sakshi News home page

మడేలయ్యస్వామి బోనాలు

Jul 23 2026 2:18 AM | Updated on Jul 23 2026 2:18 AM

రామగిరి: బేగంపేటలో రజకులు బుధవారం మడేలయ్యస్వామి బోనాల వేడుక వైభవంగా నిర్వహించారు. రజకవాడ నుంచి భక్తులు సామూహిక బోనాలతో డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా ఆలయానికి తరలివెళ్లారు. స్వామివారికి బోనంతో నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని వేడుకున్నారు. మాదాసి శ్రీనివాస్‌, బాలేల్లు పాల్గొన్నారు.

పనులు వేగవంతం చేయాలి

పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ అభివృద్ధిని వేగవంతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య కోరారు. బుధవారం సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయంలో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌ కుమార్‌ శ్రీవాత్సవను కలిసి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్సీ మాట్లాడు తూ, అమృత్‌ భారత్‌ పథకం ద్వారా పెద్దపల్లి రైల్వేస్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు ఆలస్యమవుతున్నాయన్నారు. వాటిని వేగంగా పూర్తిచేయాలని కోరారు. జీఎం సానుకూలంగా స్పందించినట్లు కొమురయ్య తెలిపారు.

స్వచ్ఛతకు గుర్తింపు

ఫెర్టిలైజర్‌సిటీ: స్వచ్ఛత, పచ్చదనంతోపాటు నాణ్యమైన విద్య అందిస్తూ జాతీయస్థాయిలో ‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ పురస్కారం సాధించిన పాలకుర్తి మండలం ఎల్కలపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అనుమ లక్ష్మీనారాయణను పీఆ ర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి బుధవారం స్కూల్‌లో సన్మానించారు. దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాల రూ పురేఖలు మార్చి, జాతీయస్థాయిలో గుర్తింపు తేవడం గర్వకారణమన్నారు. అనంతరం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు చేపట్టారు. యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కానుగంటి శ్రీనివాస్‌, నాయకులు, టీచర్లు పాల్గొన్నారు.

పత్తి పంట పరిశీలన

కమాన్‌పూర్‌: వివిధ గ్రామాల్లో సాగైన పత్తి పంటను రామగిరి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త లు వెంకన్న, కిరణ్‌ బుధవారం పరిశీలించారు. పత్తి మొక్కలపై త్రిప్స్‌(పురుగు) ఉధృతి ఉందని, దానినివారణకు చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు. శాస్త్రవేత్తల వెంట ఏవో రామకృష్ణ, ఏఈవో రామకృష్ణ ఉన్నారు.

అలవెన్స్‌ల కోసం ఆందోళన

రామగుండం: తమ డిమాండ్ల సాధన కోసం రన్నింగ్‌ స్టాఫ్‌(లోకోపైలెట్లు) బుధవారం స్థాని క రైల్వేప్లాటఫారమ్‌పై ఆందోళన చేపట్టారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ జాతీ య కమిటీ పిలుపు మేరకు నిరసన తెలిపారు. తమకు సైన్‌ ఆన్‌ నుంచి సైన్‌ ఆఫ్‌ వరకు కనీ సం 120 కిలోమీటర్ల అలవెన్స్‌ చెల్లించాలనే డిమాండ్‌ చేశారు. మజ్దూర్‌ యూనియన్‌ ప్రతినిధులు, లోకోపైలెట్లు ఓవై స్వామి, మోజెస్‌, రాథోడ్‌ ఆనంద్‌, రఘు, మధు, రామారావు, కుమార్‌, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించండి

పెద్దపల్లిరూరల్‌: కేజీబీవీ, యూఆర్‌ఎస్‌, ఎస్‌ఎ స్‌ఏ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు లక్ష్మణ్‌, రహీముద్దిన్‌ డిమాండ్‌ చేశారు. ఎంఈ వో ఆఫీసు ఎదుట బుధవారం సీఎంకు పోస్టుకార్డులు రాసి నిరసన తెలిపారు. మినిమం టైంస్కేల్‌ ఇవ్వాలని, సెలవులు వర్తింపజేయాలని కోరారు. సమ్మెకాలపు జీతాలు విడుదల చే యాలని కోరారు. నాయకులు శ్రీలత, శ్రీనివా స్‌, సంధ్యారాణి, సంపత్‌, రజని పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement