పెద్దపల్లిరూరల్: ‘ప్రధాని నరేంద్రమోదీ పాలనలో ‘నీట్’ ప్రశ్నాపత్రం లీకేజీ అయింది.. విద్యార్థుల కష్టమంతా వృథా అయింది.. వారి జీవితాలతో కేంద్రప్రభుత్వం చెలగాటమాడుతోంది’ అని ప్రభుత్వ విప్ విజయరమణారావు దుయ్యబట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ అరెస్టులను నిరసిస్తూ, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీ నామా చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాకేంద్రంలోని కమాన్ చౌరస్తా వద్ద రాజీవ్ రహదారిపై కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులతో కలిసి విప్ బుధవారం బైఠాయించారు. యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తారని ప్రధాని మోదీపై పెట్టుకున్న ఆశ లు అడియాసలయ్యాయన్నారు. విద్యార్థుల న్యా యమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్మన్లు మల్లయ్య, రాధాకృష్ణతోపాటు మార్కెట్ కమిటీ చైర్మన్లు కూర మల్లారెడ్డి, ప్రకాశ్‌రావు, తిరుపతిరెడ్డి, సింగిల్‌విండో చైర్మన్లు ముత్యాల నరేశ్, రాజేశ్వర్‌రెడ్డి, సతీశ్, జానీ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే
ఊరుకునేదిలేదు
గోదావరిఖని: ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని డీసీసీ అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ హెచ్చరించారు. ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ రహదారిపై చేపట్టిన ధర్నాలో రాజ్‌ఠాకూర్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రతీ పౌరుడికి శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు కల్పించిందని, ప్రజల తరఫున ప్రశ్నించే ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమన్నారు. కార్యక్రమంలో మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పా తిపెల్లి ఎల్లయ్య, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో విఫలం
నిరసన తెలిపేందుకు వస్తే అక్రమ అరెస్టులా..?
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక అరెస్టుపై నిరసన
రాజీవ్ రహదారిపై బైఠాయించిన ప్రభుత్వ విప్ విజయరమణారావు


