నేరాల నియంత్రణే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణే లక్ష్యం

Jul 24 2026 1:39 AM | Updated on Jul 24 2026 1:39 AM

ధర్మారం: నేరాల నియంత్రణకు పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి ఏసీపీ కృష్ణ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం ధర్మారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. రికార్డులు, కేసుల నిర్వహణ, పరిపాలన విధానాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ప్రజలకు సత్వర సేవలు అందించడంతో పాటు నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో కీలకమని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులు, ఘటనలపై పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. పెద్దపల్లి సీఐ ప్రవీణ్‌కుమార్‌, ఎస్సై ప్రవీణ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

పీహెచ్‌సీ తనిఖీ

కమాన్‌పూర్‌(మంథని): మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి పవిత్ర గురువారం తనిఖీ చేశారు. ఓపీ, ఫార్మసీ రికార్డులు, గదులను పరిశీలించారు. సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వైద్యం కోసం వచ్చే వారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పీహెచ్‌సీలో సిబ్బంది లేక వైద్యం కోసం వచ్చే వారు ఇబ్బందులకు గురువుతున్నారని డీఎంహెచ్‌వోకు వివరించారు. డీఎంహెచ్‌వో వెంట డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీరాములు, డాక్టర్‌ లక్ష్మిభవానీ, సీహెచ్‌వో శ్రీనివాసరెడ్డి, పీహెచ్‌సీ వైద్యాధికారి సల్మాబేగం, రమాదేవీలున్నారు.

నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలి

సుల్తానాబాద్‌ రూరల్‌: ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు నీటి కుంటలు చేసుకోవాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్యాంప్రసాద్‌ అన్నారు. సుల్తానాబాద్‌ ఎంపీడీవో కార్యాయలంలో గురువారం జలసిరిపై నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో రైతులు నీటి కుంటలు, ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు, ప్రతీ గ్రామానికి రెండు చొప్పున నీటి కుంటలు నిర్మించుకునేందుకు వందశాతం రాయితీపై ఉపాధి హామీ పథకంలో ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీవో దివ్యదర్శన్‌, మండల వ్యవసాయ అధికారి పైడి తల్లి, ఏపీవో రాజేశ్వరి, ఎంపీవో మౌనిక, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, ఉద్యాన విస్తరణ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement