రైతు భరోసా రూ.161.39 కోట్లు | - | Sakshi
Sakshi News home page

రైతు భరోసా రూ.161.39 కోట్లు

Jul 24 2026 1:39 AM | Updated on Jul 24 2026 1:39 AM

పెద్దపల్లి: రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. గతంలో లబ్ధిపొందుతున్న 1,53,582 మంది రైతు ల ఖాతాల్లోకి రూ.161.39 కోట్లు (రూ. 1,61,38,59,520) చేరాయి. ఈక్రాప్‌ నమోదు ఆధారంగా 54 ఎకరాల వరకు సాగు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులు జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. కొత్తగా నమోదైన 1,068 మంది రైతులకు దశల వారీగా నిధులు జమకానున్నాయి.

పెట్టుబడి సాయం కీలకం

కొన్నేళ్లుగా ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు ఆలస్యంగా కురవడం, వర్షపాతం అసమానంగా ఉండటం, సాగు ఖర్చులు పెరగడం వంటి పరిస్థితులు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కొనుగోలు వ్యయం పెరిగిన నేపథ్యంలో రైతు భరోసా కింద ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయం రైతులకు ఉపశమనంగా మారుతోంది. వానాకాలం సాగు ప్రారంభ దశలోనే నిధులు ఖాతాల్లో జమ కావడంతో రైతులు సాగు పనులను వేగవంతం చేసుకునే అవకాశం ఏర్పడింది.

మండలాల వారీగా రైతు భరోసా నిధుల వివరాలు

మండలం రైతులు రైతుభరోసా

పెద్దపల్లి 21,618 రూ.21.48 కోట్లు

ధర్మారం 17,852 రూ.17.27 కోట్లు

సుల్తానాబాద్‌ 16,082 రూ.16.05 కోట్లు

మంథని 15,588 రూ.18.80 కోట్లు

ఓదెల 14,316 రూ.15.88 కోట్లు

కాల్వశ్రీరాంపూర్‌ 14,184 రూ.16.43 కోట్లు

జూలపల్లి 10,421 రూ.10.42 కోట్లు

ముత్తారం,మంథని 8,184 రూ.9.18 కోట్లు

పాలకుర్తి 7,847 రూ.7.65 కోట్లు

ఎలిగేడు 7,604 రూ.8.27 కోట్లు

రామగిరి 6,370 రూ.7.08 కోట్లు

అంతర్గాం 5,965 రూ.6.15 కోట్లు

కమాన్‌పూర్‌ 5,616 రూ.5.11 కోట్లు

రామగుండం 1,935 రూ.1.60 కోట్లు

1,53,582 మంది రైతుల ఖాతాల్లో జమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement