పెద్దపల్లిరూరల్: ఓటరు సమగ్ర సర్వే (ఎస్‌ఐఆర్) ఫారం మీకు అందలేదా? అయితే ఆందోళన పడొద్దు.. మీరు మీ సమీపంలోని తహసీల్దార్ కార్యాలయంలోని ఎన్నికల అధికారి వద్దకు వెళ్లి ఉచితంగానే పొందవచ్చు. జిల్లాలోని ప్రతీ పట్టణం, పల్లెల్లో ఇంటింటికీ తిరిగి బీఎల్‌వోలు ఎన్యూమరేటర్ దరఖాస్తు ఫారాలు అందించి వాటిని భర్తీ చేసి తిరిగి అప్పగించాలని ఇప్పటికే సూచించారు. అయితే కొంతమంది వలస వెళ్లడం, ఇతరత్రా కారణాలతో ఎన్యూమరేటర్ నుంచి దరఖాస్తు ఫారం పొందని ఓటర్లు ఎలాంటి కంగారు పడకుండా నేరుగా తమ మండల తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఓటరు కార్డు వివరాలు చెప్పి ఎన్యూమరేటర్ దరఖాస్తు ఫారాన్ని పొందవచ్చని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పెద్దపల్లి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో దరఖాస్తు ఫారం రాని కొందరు తహసీల్దార్ కార్యాలయానికి వస్తే ఆన్‌లైన్‌లో వారి వివరాల ఆధారంగా ఫారం డౌన్‌లోడ్ చేసి అందిస్తున్నామని డీటీ రవీందర్ తెలిపారు. మీసేవ కేంద్రాలకు వెళ్లినా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తారని పేర్కొన్నారు.
అయితే తహసీల్దార్ ఆఫీసుకు రండి


