రామగుండం: పట్టణంలోని పెద్దచెరువులో పూడికతీత చేపట్టి రూ.6.50కోట్లతో మినీ ట్యాంక్‌బండ్ అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్ అన్నారు. గురువారం రామగుండంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామితో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. హౌసింగ్‌బోర్డులో శిథిలావస్థకు చేరి కూలిపోయిన సింగరేణి క్వార్టర్లను పూర్తిగా తొలగించి ఆ ప్రాంతంలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. గోదావరినది వరకు రహదారి విస్తరణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు దీటి బాలరాజు, కార్పొరేటర్ ఇసంపెల్లి అంజులు, దారంగుల కుమార్, కాంగ్రెస్ కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేశ్, నాయకులు సలీంబేగ్, యూసుఫ్ తదితరులున్నారు.
షాపింగ్ కాంప్లెక్స్ పనులు పూర్తి చేయాలి
గోదావరిఖని: సింగరేణి షాపింగ్ కాంప్లెక్స్‌తో పాటు అంతర్గత రోడ్లను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సింగరేణి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. సింగరేణి ఖాళీ క్వార్టర్ల పరిసరాల్లో పెరిగిపోయిన చెట్ల పొదలు తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టాలన్నారు. ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, సివిల్ డీజీఎం వరప్రసాద్, సింగరేణి శ్రీనివాస్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రూ.40లక్షలతో పోచమ్మతల్లి ఆలయ నిర్మాణం
దేవాదాయశాఖ ద్వారా రూ.40లక్షల నిధులతో పోచమ్మ తల్లి ఆలయాన్ని సర్వాంగసుందరంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ అన్నారు. గురువారం ఆలయాన్ని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం పోచమ్మ ఆలయ నూతన నిర్మాణానికి సంబంధించిన నమూనా చిత్రాన్ని (మోడల్ డిజైన్) ఆవిష్కరించారు.
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్


