మహిళలకిచ్చిన హామీ మేరకు బస్సు | - | Sakshi
Sakshi News home page

మహిళలకిచ్చిన హామీ మేరకు బస్సు

Jul 24 2026 1:39 AM | Updated on Jul 24 2026 1:39 AM

ఎలిగేడు: రెండున్నర ఏళ్ల క్రితం ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీ మేరకు ముప్పిరితోట గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. గురువారం ముప్పిరితోటలో డిపో మేనేజర్‌ కవితతో కలిసి గోదావరిఖని నుంచి ముప్పిరితోట మీదుగా గర్రెపల్లి వరకు నడిచే ఆర్టీసీ బస్సును ప్రారంభించారు. స్వాతంత్య్ర చరిత్రలో ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో పాలకులు వచ్చినప్పటికీ పెద్దపల్లిలో ఆర్టీసీ డిపో ఏర్పాటుకు ప్రయత్నించిన దాఖలాలు లేవన్నారు. సీఎం రేవంత్‌రెడ్డిని ఒప్పించి 2024 డిసెంబర్‌లో పెద్దపల్లిలో నిర్వహించిన బహిరంగ సభలో బస్సు డిపో ఏర్పాటుకు ప్రకటన చేశారని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ అంతటి అన్నయ్యగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ప్రకాశ్‌రావు, తహసిల్దార్‌ యాకన్న, ఎంపీడీవో భాస్కర్‌ రావు, ఇన్‌చార్జి సర్పంచ్‌ రాయమల్లు, పలు గ్రామాల సర్పంచులు, మహిళలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.

ప్రభుత్వ విప్‌ విజయరమణారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement