‘సర్‌’ ప్రక్రియ గడువులోగా పూర్తిచేయాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ ప్రక్రియ గడువులోగా పూర్తిచేయాలి

Jul 24 2026 1:39 AM | Updated on Jul 24 2026 1:39 AM

జూలపల్లి: ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు ప్రక్రియ సర్‌ను గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. సర్‌ ప్రక్రియ, భూభారతి రీ సర్వే, రిజిస్ట్రేషన్‌ స్లాట్‌ బుకింగ్‌, పెండింగ్‌ దరఖాస్తులు, సాదాబైనామాలను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేందుకు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తహసీల్దార్‌ దత్తు ప్రసాదరావు, సిబ్బంది ఉన్నారు.

భూముల రీసర్వే పారదర్శకంగా నిర్వహించాలి

ధర్మారం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేను ప్రజల భాగస్వామ్యంతో పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. ధర్మారం మండలం పైడిచింతలపల్లిలో నిర్వహిస్తూన్న రీ సర్వేను గురువారం పరిశీలించారు. గ్రామసభల ద్వారా రీసర్వే ప్రయోజనాలకు రైతులకు వివరించాలని సూచించారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డు సోమేశ్వర్‌, మండల సర్వేయర్‌ శ్రీనివాస్‌, కృష్ణకాంత్‌, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలి

పెద్దపల్లి: ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో తాగునీటి సరఫరాను నిరంతరాయంగా కొనసాగించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మిషన్‌ భగీరథ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మిషన్‌ భగీరథ గ్రిడ్‌కు సంబంధించిన పెండింగ్‌ పనులను ఆగస్టు నెలాఖరు నాటికి పూర్తిచేసి పూర్తిస్థాయిలో తాగునీటి సరఫరాకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. మిషన్‌ భగీరథ గ్రిడ్‌ ఈఈ పూర్ణచందర్‌, ఇంట్రా ఎస్‌ఈ గంగాధర శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

బాధ్యతాయుతంగా పనిచేయాలి

పారదర్శకమైన సేవలు అందేలా ప్రతీ అధికారి బాధ్యతాయుతంగా పనిచేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం పెద్దపల్లిలోని ప్రగతినగర్‌ ఎంపీపీఎస్‌ పాఠశాల, ప్రభుత్వ సమీకృత సంక్షేమ బాలికల హాస్టల్‌ సముదాయం, పెద్దపల్లి ప్రాథమిక పాఠశాల ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విధులకు ఆటంకాలు కలిగిస్తే ఉపేక్షించం

ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకాలు కల్పిస్తే ఉపేక్షించబోమని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి మండలం రంగాపూర్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ గంట రమేశ్‌ ప్రభుత్వ అధికారిని విధుల నిర్వహణలో అడ్డుకోవడం, అసభ్యకర, అనుచిత పదజాలంతో దూషించడం, బెదిరింపులకు పాల్పడినట్లు సహాయ కార్యనిర్వహణ ఇంజినీర్‌, ఎంబీ ఇంట్రా అందజేసిన ఫిర్యాదు మేరకు షోకాజ్‌ నోటీసు జారీ చేసిశామన్నారు. షోకాజ్‌ నోటీసు అందిన ఏడు రోజులలోపు లిఖితపూర్వక సంజాయిషీని సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement