రచ్చ రంబోలా! | - | Sakshi
Sakshi News home page

రచ్చ రంబోలా!

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

సాక్షి, పెద్దపల్లి:

జిల్లాలో ఇటీవల రిసార్ట్స్‌, ఫామ్‌హౌస్‌ల సంస్కృతి వేగంగా విస్తరిస్తోంది. విశ్రాంతి, కుటుంబ వేడుకలు, వీకెండ్‌ పార్టీలు, పుట్టిన రోజులు, పెళ్లిళ్లు, కార్పొరేట్‌ ఈవెంట్ల కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాంగణాల్లో కొన్ని చోట్ల నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల సుల్తానాబాద్‌ పరిధిలోని ఓ రిసార్ట్‌లో ఇరువర్గాల మధ్య జరిగిన గొడవ చీలికి చీలికి గాలివానగా మారి, ఏకంగా బౌన్సర్లు రంగ ప్రవేశం చేసి దాడులు చేసుకునే స్థాయికి చేరింది. పోలీసుల పర్యవేక్షణ లోపంతో కొన్ని రిసార్ట్స్‌, ఫామ్‌హౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వ్యక్తిగత అవసరాల కోసం నిర్మించిన ఫామ్‌హౌస్‌లను వాణిజ్యపరంగా అద్దెకు ఇస్తుండటంతో పాటు, కొన్ని చోట్ల వ్యభిచారం, మద్యం, మాదకద్రవ్యాల వినియోగం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. శివారు ప్రాంతాల్లో ఉన్న ఈ ఫామ్‌హౌస్‌లపై పర్యవేక్షణ మరింత అవసరమని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

ఓపెన్‌ బార్లుగా మారుతున్న రిసార్ట్స్‌

పర్యాటకులు రిసార్ట్స్‌లో మద్యం సేవించడం వరకు అభ్యంతరం లేకపోయినా, కొన్ని చోట్ల బహిరంగంగా ఓపెన్‌ బార్ల తరహాలో మద్యం పార్టీలను నిర్వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు డీజే సౌండ్లు, హైమాస్ట్‌ లైట్లు, స్మోక్‌ ఎఫెక్ట్‌లతో పార్టీలు నిర్వహించడం వల్ల సమీప గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

బౌన్సర్ల హంగామా

పెళ్లిళ్లు, ప్రైవేట్‌ ఈవెంట్లలో బౌన్సర్లను నియమించుకోవడం ఫ్యాషన్‌గా మారింది. వాస్తవానికి బౌన్స ర్లు భారీ కార్యక్రమాల్లో భద్రత, జనసందోహ నియ ంత్రణ కోసం నియమించబడతారు. అయితే కొందరు స్టేటస్‌ సింబల్‌గా వీరిని వినియోగిస్తున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహించాలంటే పీఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్‌ తప్పనిసరి. అయినప్పటికీ కొన్ని నకిలీ ఏజెన్సీలు సరైన ధ్రువీకరణ లేకుండానే బౌన్సర్లుగా నియమిస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

విచ్చలవిడిగా మద్యం పార్టీలు

నిబంధనల ప్రకారం అనుమతులు పొందిన ఫంక్షన్‌ హాళ్లలో మాత్రమే నిర్ధిష్ట

సమయాల్లో మద్యం వడ్డించేందుకు అవకాశం

ఉంటుంది. అయితే కొన్ని ఫామ్‌హౌస్‌లలో ఎలాంటి అనుమతులు లేకుండానే మద్యం పార్టీలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. బహిరంగంగా మద్యం సేవించడం చట్టరీత్యా నేరమైనప్పటికీ, ఎకై ్సజ్‌ శాఖ పర్యవేక్షణ లోపించిందని విమర్శలు వినిపిస్తున్నాయి.

వినోదం ముసుగులో వికృతం

జిల్లాలో పెరిగిన

రిసార్ట్స్‌, ఫామ్‌హౌస్‌ల కల్చర్‌

విచ్చలవిడిగా మద్యం పార్టీలు, ఓపెన్‌ బార్ల తరహా వేడుకలు

వ్యవసాయ క్షేత్రాల పేరుతో వాణిజ్య కార్యకలాపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement