పెద్దపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ప్రకటించిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండియర్‌లో 68.29, ఫస్టియర్‌లో 57శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా బాలికలే పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 68శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా 16వ స్థానంలో నిలిచింది.
సెకండియర్‌లో..
సెకండియర్‌లో బాలురు 1,536 మంది పరీక్షలకు హాజరు కాగా 845 మంది పాసయ్యారు. 55శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాలికలు 2,226 మంది పరీక్షలకు హాజరు కాగా 1,724 మంది పాసై 77.45శాతం సాధించారు. మొత్తంగా జిల్లాలో 3,762 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 2,569 మంది విద్యార్థులు (68.29శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఫస్టియర్‌లో..
ఫస్టియర్‌లో బాలురు 1,704 హాజరు కాగా 668 మంది పాసై 39శాతం సాధించారు. బాలికలు 2,412కు 1,682 ఉత్తీర్ణత సాధించి 69.73శాతం నమోదైంది. మొత్తంగా బాలికలు 4,116 మంది పరీక్షలకు హాజరు కాగా 2,350 ఉత్తీర్ణత సాధించి 57 ఉత్తీర్ణత శాతం నమోదైంది.
ఒకేషనల్ విభాగంలో..
ఒకేషనల్‌లో జిల్లావ్యాప్తంగా బాలురు 445 పరీక్ష రాస్తే 249 ఉత్తీర్ణులయ్యారు. 55.96శాతం ఫలితాలు నమోదు చేశారు. బాలికలు 518కు 460 మంది పాసై 88.80 శాతం సాధించారు. మొత్తంగా 963 మంది పరీక్షలు రాయగా 709 మంది 73.62శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 582 మందికి 445 ఉత్తీర్ణత (76.46శాతం) సాధించారు.
మే 13 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు
ఇంటర్మీడియట్‌లో తప్పిన విద్యార్థుల కోసం ప్రభుత్వం డిగ్రీ వెళ్లేందుకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను మే 13 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు.
ఇంటర్ ఫలితాల్లో సత్తాచాటిన అమ్మాయిలు
రాష్ట్రస్థాయిలో 24వ స్థానంలో పెద్దపల్లి జిల్లా
సెకండియర్‌లో 68.29, ఫస్టియర్‌లో 57శాతం ఉత్తీర్ణత
ఇంటర్ ఫలితాలు ఇలా
గతేడాది సెకండియర్ ఉత్తీర్ణత శాతం 68
ఈ ఏడాది సెకండియర్ ఉత్తీర్ణత శాతం 68.29
గతేడాది ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 59
ఈ ఏడాది ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 57


