ఎలిగేడు: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ప్ర భుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదివారం బుర్హాన్‌మియాపేటలో గుజ్జుల రవళి–విజేందర్‌రెడ్డి, బొంగోని రమ–సంపత్, గుజ్జుల లావణ్య–ప్రశాంత్‌రెడ్డిలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో పాల్గొని ఇళ్లను ప్రారంభించారు. అనంతరం రూ.10లక్షలతో గ్రామంలోని అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. నర్సాపూర్‌లో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొని అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజలను మభ్యపెట్టి ఇళ్లు ఇవ్వకుండా అన్యాయం చేసిందన్నారు. సర్పంచులు గోపు లక్ష్మారెడ్డి–రజిత, పల్లెర్ల వెంకటేశ్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, నాయకులు సంతోష్‌రావు, ఉప సర్పంచులు, వార్డుసభ్యులు, కాంగ్రెస్‌పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు పాల్గొన్నారు
అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ఓదెల: అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరవుతాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. ఆదివారం రాత్రి బాయమ్మపల్లెలలో సీసీ రోడ్ల నిర్మాణాలు, కంపౌండ్‌వాల్, బ స్టాండ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయరమణారావు


