గోలేటి టు కొత్తగూడెం | - | Sakshi
Sakshi News home page

గోలేటి టు కొత్తగూడెం

Mar 14 2026 8:02 AM | Updated on Mar 14 2026 8:02 AM

● సమస్యల పరిష్కారమే ఎజెండా ● ఈనెల 17 నుంచి సేవ్‌ సింగరేణి జాత ● సమరానికి సన్నద్ధమవుతున్న గుర్తింపు యూనియన్‌ ● సింగరేణిలో రాజకీయ జోక్యాన్ని నిలిపివేయాలి. ఏసీబీ సాకుతో నిలిపివేసిన మెడికల్‌ బోర్డును పునరుద్ధరించాలి. ● డిపెండెంట్లకు సింగరేణిలో ఉద్యోగాలివ్వాలి. శిక్షణ పూర్తి చేసుకున్న 300మందికి వెంటనే పోస్టింగ్‌ ఇవ్వాలి. కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలి. పెర్క్స్‌పై ఇన్‌కంటాక్స్‌ యాజమాన్యం చెల్లించాలి. ● ఇల్లెందు, మణుగూరు, భూపాల్‌పలి, తాడిచర్ల, గోలేటి, మాదారంలో ప్రాంతాల్లో గనులు ప్రారంభించాలి. మారుపేర్ల సమస్యలు పరిష్కరించాలి. ● కార్మికుల సంక్షేమం అమలు చేయాలి. సాధారణ మరణానికి రూ.25లక్షలు చెల్లించాలి. కాంట్రాక్టు కార్మికులకు హైపవర్‌ వేతనాలు చెల్లించాలి. ● సీనియర్‌ మైనింగ్‌ సర్ధార్లకు ఓవర్‌మెన్‌లుగా పదోన్నతి కల్పించాలి. గనుల్లో ఆధునిక రక్షణ పరికరాలు ఏర్పాటు చేయాలి. ● ఈనెల 17న అన్ని గనులపై నల్లబ్యాడ్జీలతో నిరసన ● 18న శ్రీరాంపూర్‌ ఆర్కే–7 నుంచి సేవ్‌ సింగరేణి జాత ప్రారంభం ● 30న కొత్తగూడెం హెడ్డాపీస్‌ ముందు భారీ ధర్నా

● సమస్యల పరిష్కారమే ఎజెండా ● ఈనెల 17 నుంచి సేవ్‌ సింగరేణి జాత ● సమరానికి సన్నద్ధమవుతున్న గుర్తింపు యూనియన్‌

గోదావరిఖని(రామగుండం): కార్మిక సమస్యల సాధనకు గుర్తింపు యూనియన్‌ సమరానికి సన్నద్ధమవుతోంది. ప్రధాన సమస్యలు పరిష్కరించాలని సేవ్‌ సింగరేణి జాత పేరుతో గోలేటి నుంచి కొత్తగూడెం వరకు బస్సుయాత్ర నిర్వహించేందుకు ఏఐ టీయూసీ కార్యాచరణ ప్రకటించింది. 14రోజుల పాటు సంస్థ వ్యాప్తంగా సింగరేణి సేవ్‌జాత నిర్వహించి ఆందోళన ఉధృతం చేయనుంది. సేవ్‌ జాత ఈనెల 17న ప్రారంభమై 30వరకు కొనసాగనుంది.

సమస్యల పరిష్కారమే ధ్యేయంగా..

సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారమే ఎజెండాగా గుర్తింపు యూనియన్‌ పోరాటాలకు దిగింది. 10 నెలలుగా నిలిచిపోయిన మెడికల్‌బోర్డు కొనసాగించాలని, మెడికల్‌ అన్‌ఫిట్‌ అయి శిక్షణ పూర్తి చేసుకున్న సుమారు 300 మందికి పోస్టింగ్‌ ఇవ్వాలని, స్ట్రక్చరల్‌ సమావేశంలో అంగీకరించిన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఏఐటీయూసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా 14రోజుల పాటు అన్ని ఏరియాల వారీగా పర్యటించి చివరి రోజు కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ముట్టడించనున్నారు. అంతేకాకుండా సంస్థలో పేరుకుపోయిన అంతర్గత సమస్యలపై కూడా గుర్తింపు యూనియన్‌ దృష్టి సారించింది. డైరెక్టర్‌(పా)లు ముగ్గురు మారడంతో సంస్థపై పట్టు తగ్గి, బొగ్గు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయిందని పేర్కొంటోంది. 72మిలియన్‌ టన్నుల లక్ష్యంగా ముందుకు సాగుతున్న సింగరేణి ఈసారి 60మిలియన్‌ టన్నుల ఉత్పత్తి దాటే పరిస్థితి లేదని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా 60మిలియన్‌ టన్నుల లక్ష్యానికి కుదించుకుంటోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి ఎటువైపు వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బకాయిల సంగతేంది..

సింగరేణికి ప్రభుత్వంలోని పలు శాఖల నుంచి రా వాల్సిన రూ.51వేల కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. దీని మూలంగా సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టర్ల బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయని, నెలనెలా కార్మికులకు చెల్లించా ల్సిన జీతాల కోసం ఇతర బ్యాంకుల నుంచి ఓవర్‌డ్రా ఫ్ట్‌ చేయాల్సి వస్తోందని యూనియన్‌ అంటోంది.

ప్రధాన డిమాండ్లు..

పోరాటం ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement