బైబైలు చెప్పుకుంటూ..
ఎగిరి గంతులేస్తున్న విద్యార్థులు
ఇంటర్మీడియట్ పరీక్షలు శుక్రవారంతో ముగిశాయి. చివరి పరీక్ష రాసిన విద్యార్థులు బయటకు వచ్చి తోటి స్నేహితులతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రెండేళ్లు కలిసి చదివిన విద్యార్థులకు పరీక్షలు ముగిశాయన్న ఆనందం ఓవైపు, మళ్లీ ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తామో అంటూ బాధ ఓవైపు అందరిలో కనిపించింది. డిగ్రీ, బీటెక్‌లో కులుద్దాం అంటూ కొందరు, ఎక్కడున్నా మరిచిపోవద్దంటూ మరికొందరు ముచ్చట్లు పెడుతూ బైబైలు చెప్పుకుంటూ ఇళ్లకు పయనమవడం ‘సాక్షి’కి కనిపించింది. కాగా జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్మీడియెట్ జిల్లా అధికారి కల్పన తెలిపారు. చివరి రోజు కెమిస్ట్రీ–2, కామర్స్–2 పరీక్షలకు 4,253 మంది హాజరు కావాల్సి ఉండగా 4,166మంది హాజరయ్యారని, 97శాతం హాజరైనట్లు పేర్కొన్నారు. – పెద్దపల్లి/‘సాక్షి’ ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


