ఆస్తి పన్ను బకాయిలు వసూలు చేయండి | - | Sakshi
Sakshi News home page

ఆస్తి పన్ను బకాయిలు వసూలు చేయండి

Mar 14 2026 8:02 AM | Updated on Mar 14 2026 8:02 AM

కోల్‌సిటీ: ఆర్థిక సంవత్సరం ముగింపు దృష్ట్యా పూర్తిస్థాయిలో పన్ను బకాయిలు వసూలు చేయాలని రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్‌ జె.అరుణశ్రీ అన్నారు. పన్ను వసూళ్ల పురోగతిపై శుక్రవారం నగరపాలక సంస్థ కార్యాలయంలో వార్డు అధికారులు, రెవెన్యూ విభాగం సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. భారీ బకాయి ఉన్న వారికి రెడ్‌ నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. గడువు తేదీ దాటినప్పటికీ ఆస్తి పన్ను చెల్లించని వారికి మున్సిపల్‌ సేవలు నిలిపేయాలని ఆదేశించారు. సమావేశంలో నగరపాలక సంస్థ అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌వో ఆంజనేయులు, ఆర్‌ఐ ఖాజా, సీనియర్‌ అసిస్టెంట్‌ సాగర్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ సౌమ్య తదితరులు పాల్గొన్నారు.

పిల్లలను ఎప్పటికప్పుడు కనిపెట్టాలి

యైటింక్లయిన్‌కాలనీ: పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉండాలని పెద్దపల్లి డీసీపీ రాంరెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం భవానీ గార్డెన్‌లో పిల్లల భద్రత, డ్రగ్స్‌, సైబర్‌ క్రైం తదితర అంశాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో మాట్లాడారు. విద్యార్థులు ఎలాంటి దురలవాట్లకు లోనుకాకుండా ఇష్టంతో కష్టపడి చదివితే జీవితం సుఖంగా ఉంటుందన్నారు. ఎస్‌పీ నాయక్‌ మహారాజ్‌ తన మాటలు పాటలతో డ్రగ్ప్‌, గంజాయి, మత్తుపదార్థాలు, సైబర్‌ క్రైంలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో టూటౌన్‌ సీఐ ప్రసాద్‌రావు, పోలీస్‌ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

15నుంచి అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ తరగతులు

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 15నుంచి అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్‌ యూనివర్సిటీ) రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ తరగతులు ప్రారంభమవుతాయని కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మినర్సయ్య తెలిపారు. ఫస్టియర్‌, సెకండియర్‌, ఫైనలియర్‌లో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాలని అన్నారు.

క్వింటాల్‌ పత్తి రూ.7,031

పెద్దపల్లిరూరల్‌: వ్యవసాయ మార్కెట్‌యార్డు ఆవరణలో శుక్రవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,031 ధర పలికింది. కనిష్టంగా రూ.5,323, సగటు రూ.6,703గా ఉందని మార్కెట్‌ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. రైతుల నుంచి 503 క్వింటాళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement