మంచి ఫలితాలు సాధించేలా
ప్రభుత్వ పాఠశాలల్లో రెండోతరగతి చదువుకునే విద్యార్థుల అభ్యసన సామర్థ్యం పెంపొందించేలా చర్యలు చేపట్టాం. ప్రతీవిద్యార్థిలో ఎంత మేర అభ్యసన సామర్థ్యం ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించి రెండురోజులపాటు ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. మూడు రోజులపాటు ఎంపిక చేసిన ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను వారు సందర్శించి అభ్యసన సామర్థ్యాలు అంచనా వేస్తారు. దీంతో మంచి ఫలితాలు సాధిస్తామనే నమ్మకం ఉంది.
– పీఎం షేక్, జిల్లా అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్


