దోషులను శిక్షించాలని ర్యాలీ
రామగిరి: నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర ఘటనకు కారకులైన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని రజక సంఘం జిల్లా సమన్వయకర్త నాగెల్లి సాంబయ్య డిమాండ్ చేశారు. సెంటినరీకాలనీ తెలంగాణ చౌరస్తా నుంచి మార్కెట్ చౌరస్తా వరకు బుధవారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతినిధులు బానేశ్, కుమార్ యాదవ్, చెలుకల జవహర్, నూనె రాజేశం, బత్తుల శంకర్, దేవ శ్రీనివాస్, నల్లూరి లింగయ్య, మాదాసి శ్రీనివాస్, బండి రంజిత్ కుమార్, ధర్ముల రాజయ్య, పున్నం సమ్మయ్య పాల్గొన్నారు.


