వంటగ్యాస్ లీకై ఇంటిపైకప్పు ధ్వంసం
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారంలో బుధవారం ఎం.అశోక్ ఇంట్లో వంట గ్యాస్‌లీకై ంది. దీంతో ఇంటి పైకప్పుతోపాటు వంట, ఇతరసామగ్రి ధ్వంసమైంది. ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లివచ్చేసరికి గ్యాస్‌లీకై న వాసన వచ్చింది. లోనికి వెళ్లిచూడగా గ్యాస్‌పైప్ ఊడిపోయి కనిపించింది. అశోక్ వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. మంటలు వ్యాపించి ఉంటే ఇల్లుమొత్తం కాలిపోయేది. ప్రమాదం ఎలా జరిగిందనేది అంతుచిక్కడం లేదని గ్రామస్తులతోపాటు మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్ తెలిపారు.


