రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
జ్యోతినగర్(రామగుండం): పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్ రాజీవ్ రహదారిపై బుధవారం రాత్రి జరి గిన రోడ్డు ప్రమాదంలో మాలోతో రాజేశ్(22) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. రా మగుండం ఎస్టీ కాలనీకి చెందిన మాలోత్ రాజేశ్ టైల్స్‌వర్క్ చేసుకుంటూ జీవిస్తున్నాడు. తల్లిదండ్రులు చిన్నతనంలోనే మృతి చెందడంతో ఒంటరిగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి టైల్స్ పనులు ముగించుకుని ఎస్టీకాలనీకి వెళ్లేక్రమంలో మేడిపల్లి సెంటర్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. గాయాలైన రాజేశ్‌ను గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
జీడీకే–11గనిలో కార్మికునికి గాయాలు
గోదావరిఖని: సింగరేణి సంస్థ రామగుండం డివిజన్–1 పరిధిలోని జీడీకే–11గనిలో ప్రమా దం జరిగి ఐలయ్య అనే కోల్‌కట్టర్ కార్మికునికి గాయాలయ్యాయి. గనిలో బ్లాస్టింగ్ అనంత రం చెటాయి చేస్తుండగా సైడ్‌ఫాల్ అయి కార్మికుడి నడుము, కుడికాలుపై బొగ్గు పెళ్లలు ప డ్డాయి. తీవ్రంగా గాయపడిన కార్మికున్ని వెంటనే గనిలోంచి పైకి తీసుకొచ్చి గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స చేసి హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఐఎన్‌టీయూసీ నాయకులు నర్సింహారెడ్డి, సదానందం బాధితుడిని పరామర్శించారు.
జీరో పెండెన్సీ లక్ష్యం
గోదావరిఖని: జీరో పెండెన్సీ లక్ష్యంగా సీఎంపీఎఫ్ కార్యాలయం పనిచేస్తోందని రామగుండం రీజినల్ కమిషనర్ హరిపచౌరి అన్నారు. బుధవారం ఆర్జీ–1 జీఎం కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లా డారు. సీఎంపీఎఫ్ ఆధ్వర్యంలో ప్రయాస్ ద్వారా పింఛన్‌దావాలను తక్షణమే పరిష్కరిస్తున్నామన్నారు. జీఎం లలిత్‌కుమార్ మాట్లాడుతూ. సీఎంపీఎఫ్ నంబర్ అలాట్‌మెంట్, పదవీ విరమణ ఉద్యోగుల క్లెయిమ్స్ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌వోటూ జీఎం చంద్రశేఖర్, ఫైనాన్స్ డీజీఎం ధనలక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.
గుండెపోటుతో రైతు మృతి
జమ్మికుంట: మండలంలోని జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన గుజ్జ గోపాలరావు(45)గుండెపోటుతో బుధవారం మృతిచెందాడు. గోపాలరావు పొలానికి నీరు పెడుతుండగా గుండెపోటుకు గురై అక్కడే కుప్పకూలిపోయాడు. చుట్టుపక్కల వారు గమనించగా చనిపోయి ఉన్నాడు. మృతుడిని భార్య ఉమ, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
వ్యక్తి బలవన్మరణం
మల్యాల: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎ స్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. జగిత్యాల మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన వల్లెపు మహేశ్(38) ఈనెల 24న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడు. కుటుంబ కలహాలు, అప్పుల బాధతో మనస్తాపం చెంది నూకపల్లి డబుల్ బెడ్‌రూం కాలనీలోని తనకు కేటాయించిన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. మృతుడి తండ్రి రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
దుబాయిలో తప్పిపోయిన వలసజీవి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన లింగాల శ్రీని వాస్‌గౌడ్ దుబాయిలో తప్పిపోయినట్లు కు టుంబ సభ్యులు తెలిపారు. పదిరోజుల క్రితమే ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. కంపెనీకి చేరుకున్న తర్వాత బయటకు వచ్చి.. ఇతరుల ఫోన్‌నుంచి కుటుంబ సభ్యులకు ఫోన్‌చేసి తా ను తప్పిపోయినట్లు తెలిపాడు. తర్వాత నుంచి సమాచారం దొరకడం లేదు. తన భర్త ఆచూకీ కనిపెట్టి స్వగ్రామానికి పంపించాలని శ్రీనివాస్ భార్య వేడుకుంటుంది.
గుర్తు తెలియని శవం లభ్యం
చొప్పదండి: పెద్దకూర్మపల్లి శివారులోని ఎస్సారెస్పీ కాకతీయ కాలువలో బుధవారం పోలీసులు ఓ మృతదేహాన్ని కనుగొన్నారు. ఎస్సై నరేశ్‌రెడ్డి వివరాల ప్రకారం.. సుమారు 40 నుంచి 50ఏళ్ల వయస్సు, ఎత్తు 5 అడుగుల ఆరు అంగుళాలు, తలపై తెల్ల వెంట్రుకలు, ఒంటిపై గ్రీన్ కలర్ గీతలు గల షర్ట్ ఒకటి, ఎరుపు రంగు టీషర్టు ఒకటి, మూడు ప్యాంట్లు ధరించి ఉన్నవ్యక్తిశవం కాలువలో కొట్టుకొచ్చింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


