ఓదెల మల్లన్నకు పూజలు | - | Sakshi
Sakshi News home page

ఓదెల మల్లన్నకు పూజలు

Feb 26 2026 7:24 AM | Updated on Feb 26 2026 7:24 AM

ఓదెల

ఓదెల మల్లన్నకు పూజలు

ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి దే వస్థానంలో బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. ఒగ్గు పూజారులతో స్వామివారికి పట్నాలు వే యించి బోనాలతో నైవేద్యం సమర్పించారు.

బాధ్యతలు స్వీకరణ

పెద్దపల్లి: ఎస్సీ కా ర్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ గా జి.శ్రవణ్‌ కు మార్‌ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అ నంతరం ఆయన కలెక్టర్‌ కోయశ్రీహర్షను కలుసుకుని పూలమొక్క అందజేశారు.

ఆస్తుల పరిరక్షణ లక్ష్యం

గోదావరిఖని: సింగరేణి ఆస్తుల పరిరక్షణే ధ్యే యంగా పనిచేయాలని ఆ సంస్థ చీఫ్‌సెక్యూరిటీ అధికారి బాలరాజు సూచించారు. బుధవారం ఏరియాలోని సెక్యూరిటీ అధికారులు, సిబ్బందితో సమావేశమై, చోరీలు, కేసులు తదితర వి వరాలపై ఆరాతీశారు. సమావేశంలో ఆర్జీ–2 సెక్యూరిటీ అధికారి షరీఫ్‌మహ్మద్‌, ఆర్జీ–3 సెక్యూరిటీ అధికారి షబ్బీరుద్దీన్‌, సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వామి తదితరులు పాల్గొన్నారు.

ఎన్టీపీసీలో ఆర్‌ఈడీ పర్యటన

జ్యోతినగర్‌(రామగుండం): ఎన్టీపీసీ సదరన్‌ రీజియన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అరిందం సిన్హా బుధవారం రామగుండంలోని తెలంగాణ ప్రా జెక్టును సందర్శించారు. కంట్రోల్‌ రూమ్‌ పరి శీలించారు. తెలంగాణ ప్లాంట్‌లో క్యాంటీన్‌ ప్రారంభించారు. ఉన్నతాధికారులు, యువ ఇంజినీర్లు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులతో సమావేశమై ప్రాజెక్టు పనితీరుపై చర్చించారు. కార్యక్రమంలో ఏజీఎం హెచ్‌ఆర్‌ బిజయ్‌కుమార్‌ సిగ్దర్‌ తదితరులు పాల్గొన్నారు.

స్పోర్ట్స్‌ స్కూల్‌లో ప్రవేశాలు

పెద్దపల్లి: హైదరాబాద్‌లోని హకీంపేట, కరీంన గర్‌, ఆదిలాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూళ్లలో నాలుగో త రగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని జిల్లా యువజన, క్రీడల శాఖ అధి కారి సురేశ్‌ తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 26 నుంచి మార్చి 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

నియామకం

పెద్దపల్లి: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మ హిళా విభాగం జిల్లా కన్వీనర్‌గా దేవా భారతిని నియమించారు. ఈమేరకు రాష్ట్ర అధ్యక్షుడు వో రగంటి ఆనంద్‌ బుధవారం నియామక పత్రా న్ని ఆమెకు అందజేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నందుకు గుర్తించి ఈ పదవి అప్పగించినట్లు ఆయన తెలిపారు.

మాతోనే సమస్యల పరిష్కారం

గోదావరిఖని: ఐఎన్‌టీయూసీతోనే సింగరేణి కార్మికుల పెండింగ్‌ సమస్యలు పరిష్కారం అ వుతాయని ఆ యూనియన్‌ సెక్రటరీ జనరల్‌ జ నక్‌ప్రసాద్‌ అన్నారు. స్థానిక జనక్‌భవన్‌లో బు ధవారం నిర్వహించిన ఆర్జీ–1 ఏరియా సర్వసభ్య సమావేశంలో మాట్లాడారు. కచ్చకాయల సదానందం, నరసింహారెడ్డి, ధర్మపురి, జెట్టి శంకర్‌రావు, వికాస్‌కుమార్‌యాదవ్‌ ఉన్నారు.

ఓదెల మల్లన్నకు పూజలు 
1
1/5

ఓదెల మల్లన్నకు పూజలు

ఓదెల మల్లన్నకు పూజలు 
2
2/5

ఓదెల మల్లన్నకు పూజలు

ఓదెల మల్లన్నకు పూజలు 
3
3/5

ఓదెల మల్లన్నకు పూజలు

ఓదెల మల్లన్నకు పూజలు 
4
4/5

ఓదెల మల్లన్నకు పూజలు

ఓదెల మల్లన్నకు పూజలు 
5
5/5

ఓదెల మల్లన్నకు పూజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement