అంచనాల్లో ఆశావహులు
రిజర్వేషన్లపై ఎవరికి వారే లెక్కలు జనరల్ స్థానాలపై సీనియర్ నేతల దృష్టి వార్డులు/డివిజన్ ఓటరు జాబితాపై కసరత్తు మున్సిపపాలిటీల్లో రాజకీయ సందడి
సాక్షి పెద్దపల్లి: బల్దియాల్లో ఓటరు జాబితా సవరణ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ప్రభుత్వం సైతం ఎన్నికలు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతోంది. దీంతో జిల్లాలోని రామగుండం నగరంతోపాటు సుల్తానాబాద్, పెద్దపల్లి, మంథని పట్టణల్లో రాజకీయ సందడి వేడెక్కింది.
పంచాయతీల్లో 50శాతం లోపు రిజర్వేషన్లతో..
ఇటీవల జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 50శాతం లోపే రిజర్వేషన్లు ఖరారు చేశారు. మున్సిపాలిటీ లు, మున్సిపల్ కార్పొరేషన్‌లోనూ అదేపద్ధతిన రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించనున్నారు. కాంగ్రె స్, బీఆర్‌ఎస్, బీజేపీ త రఫున పోటీచేసేందుకు సి ద్ధమవుతున్న వారిలో రిజర్వేష న్లపై ఉత్కంఠ మొదలైంది. తమ వా ర్డు/డివిజన్‌లో రిజర్వేషన్ సౌకర్యం కలిసి వస్తుందో, లేదోననే ఆందోళన ఆశా వహులను వెంటాడు తోంది. తాము నివా సం ఉండే వార్డు/డివిజన్‌లో రిజర్వేష న్ కలిసివస్తే పో టీ చేసేందుకు కొందరు ఆసక్తి చూపుతుండగా.. మరికొందరు ఎక్కడ రిజర్వేషన్ సౌకర్యం కలిసి వస్తే అక్కడ పోటీ చేసేందుకు ముందస్తు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు.
జనరల్ స్థానాలపైనే అందరి దృష్టి
తమ డివిజన్/వార్డులో రిజర్వేషన్ కలిసిరాకపోతే జనరల్ స్థానాల్లో పోటీచేసేందుకు సైతం ఆశావహులు ఆలోచన చేస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా పలుచోట్ల గెలుపొందారు. దీంతో జనరల్ స్థానాల్లోనూ పోటీచేసేందుకు బీసీ నేతలు సిద్ధమవుతున్నారు.
రిజర్వేషన్‌పై స్పష్టత లేక
మున్సిపల్ చైర్‌పర్సన్, కార్పొరేషన్ మేయర్ స్థానాల రిజర్వేషన్లపై ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాలేదు. ఈసారి రిజర్వేషన్లు సీపెక్ సర్వే ప్రకారం చేస్తారా? లేక డివిజన్/వార్డు సభల ద్వారా నిర్ధారణ చేస్తారా? అన్నది ఎన్నికల కమిషన్ నిర్ణయించనుంది. ప్రస్తుతం ఉన్నరిజర్వేషన్లలో మహిళా, జనరల్ రిజర్వేషన్లు రొటేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని నేతలు భావిస్తున్నారు. మొత్తంగా మున్సిపల్ ఎన్నికలు జరిగితే రిజర్వేషన్లు ఎలా ఉంటాయన్న దానిపైనే అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఓటరు జాబితాపై ఫోకస్
జిల్లాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, మంథని, సుల్తానాబాద్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వాటిలో ఓటరు ముసాయిదా జాబితాను ఇప్పటికే ప్రకటించారు. ఆశావాహులు తమ డివిజన్/వార్డులోని ఓటరు జాబితాను వడపోస్తూ, తమ డివిజన్/వార్డులో ఉన్నవారు వేరే డివిజన్/వార్డులోకి జంప్ అయిన వారిని గుర్తించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే స్థానికంగా లేని వారిని, చనిపోయిన వారి పేర్లను తొలగించేలా అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మొత్తంగా ఏఏ ప్రాంతాల్లో ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారనే లెక్కలు తీస్తూ, గతంలో ఏ వాటికి ఏ రిజర్వేషన్లు ప్రకటించారు, రొటేషన్ పద్ధతిలో ఇప్పుడు ఏ రిజర్వేషన్లు వస్తోయో అంటూ లెక్కలు వేసుకుంటున్నారు.


