ఉద్యోగుల ఫిట్‌నెస్‌ రన్‌ | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఫిట్‌నెస్‌ రన్‌

Jan 6 2026 2:01 PM | Updated on Jan 6 2026 2:01 PM

ఉద్యో

ఉద్యోగుల ఫిట్‌నెస్‌ రన్‌

10 నుంచి అథ్లెటిక్స్‌ పోటీలు రామగుండం అభివృద్ధి లక్ష్యం క్వింటాల్‌ పత్తి రూ.7,511

రామగుండం: ఎన్టీపీసీ ఉద్యోగులు(ఆపరేషన్‌), వారి కుటుంబసభ్యులతో సోమవారం రన్‌ఫర్‌ ఫిట్నెస్‌ నిర్వహించారు. ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని స్పందన క్లబ్‌ వద్ద ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సీకే స మంత, డీఎంఎస్‌ అధ్యక్షురాలు రాఖీ సమంత సమక్షంలో ఫిట్‌నెస్‌ రన్‌ నిర్వహించారు. 300 మందికిపైగా పాల్గొన్నారు. ఫిట్‌నెస్‌, తెలంగా ణ ప్రాజెక్టు జీఎం (ఓఅండ్‌ఎం) ముకుల్‌రాయ్‌, రామగుండం జీఎం (ఓఅండ్‌ఎం) మ నీష్‌ అగర్వాల్‌, ఐఆర్‌ లహరి, హెచ్‌వోడీ(ఆపరేషన్‌) ఎంకే ఝా తదితరులు పాల్గొన్నారు.

రామగుండం: ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో ఈ నెల 10 నుంచి జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్‌ జిల్లా అధ్య క్ష, కార్యదర్శులు కొలిపాక శ్రీనివాస్‌, కె.గట్ట య్య తెలిపారు. ఆసక్తి గలక్రీడాకారులు వయ సు ధ్రువీకరణ పత్రంతో ఉదయం 8గంటలకు హైస్కూల్‌లో హాజరుకావాలని సూచించారు.

రామగుండం: కాంగ్రె స్‌ బీసీ సెల్‌ జిల్లా అ ధ్యక్షుడు పెండ్యాల మహేశ్‌ మంత్రి శ్రీధర్‌బాబును అసెంబ్లీ లాబీలో సోమవారం కలిశారు. శాలువాతో సత్కరించి సన్మానించారు. కొత్త సంవత్సరంలో నియోజవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఐటీ రంగాన్ని విస్తృత పర్చుతా మన్నారు. అనంతరం పంచాయతీరాజ్‌ మంత్రి సీతక్క తదితరులను మహేశ్‌ కలిసి అభివృద్ధి పనులు, పలు సమస్యలపై విన్నవించారు.

పెద్దపల్లిరూరల్‌: స్థానిక వ్యవసాయ మార్కెట్‌ లో సోమవారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,511 ధర పలికింది. కనిష్టంగా రూ. 6,011గా, సగటు రూ.7,261 ధర ఉందని ఇన్‌ చార్జి కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. పలువురు రైతుల నుంచి 484 క్వింటాళ్ల పత్తి కొ నుగోలు చేసినట్లు ఆయన వివరించారు.

‘పత్తిపాక’ పూర్తిచేయాలి

పెద్దపల్లి: పత్తిపాక రిజర్వా యర్‌ నిర్మాణం పూర్తిచేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు కోరారు. సో మవారం అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దపల్లి, మంథని, రామగుండం, ధర్మపురి నియోజకవర్గా ల్లోని 2.22 లక్షల ఆకయట్టుకు పత్తిపాక ద్వారా సాగునీరు అందుతుందని అన్నారు. మానేరు, హుస్సేమియా వాగులపై చెక్‌డ్యాంలు కొట్టుకు పోయాయని, దీనిపై నిజనిర్ధారణ కోసం రిటైర్డ్‌ జడ్జితో కమిటీ వేయాలని కోరారు.

జాతీయ పోటీలకు ఎంపిక

గోదావరిఖనిటౌన్‌: కరీంనగర్‌లో ఇటీవల నిర్వహించిన ఇంటర్‌ స్టేట్‌ ఓపెన్‌ కరాటే చాంపియన్‌షిప్‌ – 2026 జాతీయస్థాయి పోటీల్లో గోదావరిఖనికి చెందిన ఒకినొవా రెడ్‌ డ్రాగన్‌ ఇనిస్టిట్యూట్‌ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. 4 గోల్డ్‌, 2 సిల్వర్‌, 3 బ్రోంజ్‌ పతకాలు సాధించారు. ఇందులో పి.దేవాన్ష్‌, ఎ.మాన్విత్‌, ఇ.ఆరాధ్య, అలాన్‌, ఆకాశ్‌, ఆశితకవనేం, రాజా, విష్ణువర్థన్‌, మోహిద్‌ ఉన్నారు. వీరిని ఇనిస్టిట్యూట్‌ నిర్వాహకుడు కరాటే మొండయ్య, కోచ్‌ క్రాంతి కుమార్‌ అభినందించారు.

కంప్యూటర్‌ విద్య అవసరం

ధర్మారం(ధర్మపురి): విద్యార్థులకు కంప్యూటర్‌ విద్య అత్యంత అవసరమని జిల్లా అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌ పీఎం షేక్‌ అన్నారు. రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవా రం ఆయన కంప్యూటర్‌ విద్య ప్రారంభించారు. చింతలపల్లి ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలను సందర్శించారు. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో కంప్యూటర్‌ విద్య అభ్యసన స్థాయి పెంచుతుందని తెలిపారు. ఎంఈవో ప్రభాకర్‌, హెచ్‌ఎం సముద్రాల వంశీమోహనాచార్యులు, సర్పంచ్‌ సూర రజిత, ఉపసర్పంచ్‌ బైరి సురేశ్‌, ఉపాధ్యాయులు సంపత్‌, లక్ష్మణ్‌, అమ్మ ఆదర్స పాఠశాల చైర్‌ పర్సన్‌ తాళ్లపల్లి ప్రమీల, ఉన్నత పాఠశాల హెచ్‌ఎం సమ్మయ్య పాల్గొన్నారు.

రేపు బ్రెయిలీ జయంతి

పెద్దపల్లి: అంధుల ఆరాధ్యదైవం లూ యీస్‌ బ్రె యిలీ జయంతిని ఈనెల 7న నిర్వహిస్తామని జి ల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్‌రావు తెలిపారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఉదయం 11.00 గంటలకు కలెక్టరేట్‌లో నిర్వహిస్తామన్నారు.

ఉద్యోగుల ఫిట్‌నెస్‌ రన్‌ 1
1/3

ఉద్యోగుల ఫిట్‌నెస్‌ రన్‌

ఉద్యోగుల ఫిట్‌నెస్‌ రన్‌ 2
2/3

ఉద్యోగుల ఫిట్‌నెస్‌ రన్‌

ఉద్యోగుల ఫిట్‌నెస్‌ రన్‌ 3
3/3

ఉద్యోగుల ఫిట్‌నెస్‌ రన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement