రామగుండం ఓటర్లు1.82 లక్షల మంది
కోల్‌సిటీ(రామగుండం): రామగుండం బల్దియా క మిషనర్ అరుణశ్రీ గురువారం ఓటరు ముసాయి దా జాబితా ప్రదర్శించారు. నగరంలోని 60 డివిజ న్ల జాబితాను కార్యాలయంలో ప్రదర్శించారు. నగరంలోని 60 డివిజన్లలో 1,82,976 మంది ఓటర్లు ఉన్నట్లు గుర్తించినట్లు కమిషనర్ తెలిపారు.
262కుపైగా పోలింగ్ కేంద్రాలు?
ఓటర్లను పోలింగ్‌కేంద్రాల వారీగా విభజిస్తున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800కు ఓటర్లకు మించకుండా కేటాయించేలా కసరత్తు చేస్తున్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువైతే మరో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పా టు చేయడానికి లెక్కింపు చేస్తున్నారు. ఓక్కో డివిజన్‌లో సుమారు నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేసే అవకాశాలుంటాయని తెలుస్తోంది. ఈ లె క్కన నగరంలో సుమారు 262 పోలింగ్ కేంద్రాల వ రకు ఉండవచ్చని అంచనా. వీటిపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. ఈనెల 5న రాజకీయ పార్టీల ప్రతినిధులతో జరిపే సమావేశంలో ప్రకటిస్తామని కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ మారుతీప్రసాద్, కార్యదర్శి ఉమామహేశ్వర్‌రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్(ఏ సీపీ) శ్రీహరి, టీపీఎస్ నవీన్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆర్‌వో ఆంజనేయులు పాల్గొన్నారు.


