25 రోజలుగా నేర్చుకుంటున్న
వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కేంద్రంలో 25 రోజులుగా కుట్టు నేర్చుకుంటున్న. ఇదివరకు కుట్టుపై కొంత అవగాహన ఉన్నది. ఉదయం బస్సుకు వచ్చి సాయంత్రం ఇంటికి వెళ్తున్నా. కేంద్రంలో కుట్టుపై మంచిగా శిక్షణ ఇస్తున్నరు.
– తాడబోయిన స్రవంతి, ఆరెంద
చదువుకుంటూనే శిక్షణ
నేను మంథనిలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న. కుట్టుపై శిక్షణ ఇస్తున్నారంటే రోజూ వచ్చి నేర్చుకుంటున్న. ప్రస్తుతం కళాశాలకు సెలవులు ఉండటంతో మాతోటి విద్యార్థులతో కలిసి వచ్చి నేర్చుకుంటున్నం. భవిష్యత్‌లో ఉపయోగపడుతుందని ఆశిస్తున్న.
– జోడు శాలిని, స్టూడెంట్, ఆరెంద
రెండు బ్యాచ్‌లకు ట్రెయినింగ్
వెంకటాపూర్ కేంద్రంలో రోజూ రెండు బ్యాచ్‌లకు ఇద్దరం ట్రెయినర్లం మిషన్ కుట్టుపై శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ అనంతరం స్కూల్ విద్యార్థులు, ప్రభుత్వ అధికారుల యూనిఫాం కుట్టే అవకాశం వీరికే కల్పిస్తాం. వీటిద్వారా శిక్షణ పొందిన వారు ఉపాఽధి పొందుతారు. అలాగే ఇంటివద్ద కూడా ఉపాధి మార్గాలు ఎంచుకోవచ్చు.
– కుడుదుల రజిత, శిక్షకురాలు, వెంకటాపూర్
25 రోజలుగా నేర్చుకుంటున్న
25 రోజలుగా నేర్చుకుంటున్న


