‘టీ పోల్’లో ఓటరు వివరాలు
కోల్‌సిటీ(రామగుండం): మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు అడుగులు పడడంతో రామగుండం బల్దియా అధికారులు, ఉద్యోగులు మూడురోజులుగా విధు ల్లో బిజీగా గడుపుతున్నారు. మంగళవారం ఉద యం నుంచి బుధవారం వేకువజాము వరకు తె లంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్‌కు చెందిన టీ పోల్ సాఫ్ట్‌వేర్‌లో 60 డివిజన్లలో వార్డుల వారీగా ఓటర్ల వివరాలను అప్‌లోడ్ చేశారు. నగరపాలక కమిషన ర్ అరుణశ్రీ స్వయంగా ఉద్యోగులోపాటు పర్యవేక్షిస్తూ ఉండడం గమనార్హం. అయితే సుమారు లక్షా 85 వేలపైచిలుకు మంది ఓటర్లు ఉండడంతో ఈ ప్రక్రియ సకాలంలో పూర్తికాలేదు. దీంతో బుధవారం రాత్రి వరకు ఓటర్ల వివరాలను అప్‌లోడ్ చేస్తూనే ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల జాబితాను విభజించిన అధికారులు.. వార్డుల వారీగా ఓటర్ల జాబితాకు రూపకల్పన చేపట్టారు. గురువారం ఓటర్ల జాబితా డ్రాఫ్ట్ ప్రచురణ చేయనున్నారు. 60 డివిజన్లలో 260 లోపు పోలింగ్ స్టేషన్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఒక్కో పోలింగ్ బూత్‌లో 800 మంది ఓటర్ల కన్నా ఎక్కువ కాకుండా విభజిస్తున్నారని సమాచారం.


