ప్రయాణికుల రద్దీ అధికం.. రైళ్ల సంఖ్య తక్కువ
రామగుండం: మరోవారం రోజుల్లో విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించనున్నారు. పట్టణాలు, నగరంలో చదివే విద్యార్థులు, వృత్తిరీత్యా స్వగ్రామానికి దూరంగా ఉంటున్న కుటుంబాలు స్వగ్రామానికి చేరుకోవడం సహజం. కోల్‌బెల్ట్ నుంచి లక్షలాది మంది ఇలా ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. సెలవులకు వచ్చేవారితో కాగజ్‌నగర్ వైపు నడిచే రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో రద్దీ అమాంతం పెరుగుతంది. ఇందుకు అనుగుణంగా రైళ్ల సంఖ్య పెంచకపోవడం విస్మయానికి దారితీస్తోంది.
అదనపు రైళ్లు నడిపించాలి..
సికింద్రాబాద్ నుంచి సిర్‌పూర్‌కాగజ్‌నగర్ మధ్య నడిచే భాగ్యనగర్, ఇంటర్‌సిటీ, వందేభారత్, తెలంగాణ, కాగజ్‌నగర్, దాణాపూర్ తదితర రైళ్లకు అదనపు సర్వీసులు నడిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. విజయవాడ నుంచి కోల్‌బెల్ట్‌కు సైతం ప్రతీరోజు రెండు ఫెస్టివల్ రైళ్లను నడిపించాలనే డిమాండ్ ఉంది.
కోల్‌బెల్ట్ రూట్‌లో ఊసేలేని సంక్రాంతి పండుగ ప్రత్యేక రైళ్లు


