చోరీ కేసులో వ్యక్తికి జైలు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మడంలం తారుపల్లి గ్రామానికి చెందిన ఒద్ది ప్రవీణ్‌రావు కారులోంచి రూ.85 వేలు చోరీచేసిన కేసులో ఖమ్మం అర్బన్ జిల్లా రోటరీనగర్ పోలీస్ కాలనీకి చెందిన గుర్రం కోటేశ్వర్‌రావుకు నెలల జైలు, రూ.50 జరిమానా విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చినట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ఒద్ది ప్రవీణ్‌రావు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. తదుపరి ఎస్సై ఓంకార్‌యాదవ్.. నేర పరిశోధన చేసి సుల్తానాబాద్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఇరువర్గాల వాదనల తర్వాత ముద్దాయికి శిక్ష, జరిమానా విధిస్తూ జ్యుడీషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ గణేశ్ తీర్పు చెప్పారు.
ఒకేపేజీపై కొత్త క్యాలెండర్
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మడంలం తారుపల్లి జెడ్పీ హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి విద్యార్థిని ఒజ్జ అక్షిత ఒకేపేజీపై 2026 సంవత్సరపు క్యాలెండర్ రూపొందించి ఔరా అనిపించింది. దీనిపై 12 నెలల తేదీల పట్టిక తయారు చేసింది. సామాన్యంగా క్యాలెండర్ 12 పేజీలు ఉంటుంది. ఉపాధ్యాయుడు కూరపాటి సత్యప్రకాశ్‌రావు ప్రేరణతో అరుదైన క్యాలెండర్ తయారు చేసినట్లు లక్షిత తెలిపింది. క్యాలెండర్‌పై ప్రజలను చైతన్య పరిచేలా వివిధ సామాజిక అంశాలతో కూడిన నినాదాలు పొందు పర్చింది. ఆమెను హెచ్‌ఎం శ్యాంసుందర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రశంసించారు.
చోరీ కేసులో వ్యక్తికి జైలు


