వృద్ధురాలిపై వీధి కుక్క దాడి
రాయికల్: రాయికల్ పట్టణంలోని మార్కండేయనగర్ కాలనీకి చెందిన వృద్ధురాలు బాలమ్మపై వీధికుక్కలు దాడి చేశాయి. దాడిలో ఆమె కింద పడడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళారు. అత్యవసర వైద్యం కోసం అంబులెన్స్‌లో జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు.
పొలంలోనే రైతు మృతి
కోనరావుపేట(వేములవాడ): పొలం వద్ద ద్విచక్రవాహనంపై వరినారు తరలిస్తుండగా ప్రమాదవశాత్తు వాహనం పడడంతో రైతు మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొండాపూర్‌కు చెందిన నేవూరి దేవయ్య(63) పొలం వద్ద నాట్లు వేస్తున్నారు. టీవీఎస్ వాహనంపై వరినారును పెట్టుకొని వెళ్తుండగా ప్రమాదవశాత్తు వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలో పడిపోగా అతనిపై వాహనం, నారు పడింది. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందాడు. చుట్టు పక్కల రైతులు గమనించి బయటకు తీసేలోపే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్య అనసూయ, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.


