అక్షరమే ఆయుధమై..
సాక్షి పెద్దపల్లి: అక్షరమే ఆయుధమైంది. ప్రజా సమస్యలపై గళమెత్తింది. అధికారులు, పాలకులను పరుగులు పెట్టించేలా 2025లో ‘సాక్షి’ కథనాలు ప్రచురించి, చెరగని ముద్ర వేసింది. సామాన్యుల కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారం చూపింది. అవినీతి, అక్రమాలపై ఎక్కుపెట్టిన పాలకుల పనితీరును ప్రశ్నించింది. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ.. పథకాల అమలులో అలసత్వాన్ని ఎండగడుతూ అధికార యంత్రాంగాన్ని ఆలోచింపజేసింది. మరోఏడాది కాలగర్భంలో కలిసిపోతున్న వేళ ప్రజాక్షేత్రంలో ‘సాక్షి’ కథనాలు పాఠకుల హృదయాల్లో మనస్సాక్షికి సంతకంలా నిలిచాయి.
వసూళ్లకు బ్రేక్
నాణ్యత పాటించకుండా, కంపెనీ పేరు, తయారీ తేదీ, ఎక్పైరీ డేట్ లేకుండా కేక్‌లు, బ్రెడ్డు తయారు చేస్తూ ప్రజారోగ్యంతో చెలగాటమాడుగుతున్న బేకరీలపై ‘తింటే బేజారే’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన అధికార యంత్రాంగం బేకరీల్లో తనిఖీలు చేసి నిర్వాహకులకు జరిమానా విధించింది.
ప్రభుత్వ ఆస్పత్రిలో కిందిస్థాయి సిబ్బంది పేషెంట్ల వద్ద పైసలు వసూలు చేస్తున్న వైనంపై ‘సేవకో రేటు’ శీర్షికన కథనం ప్రచురించింది. స్పందించిన కలెక్టర్.. వసూళ్ల పర్వాన్ని నియంత్రించేందుకు పటిష్ట చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు, ఫిర్యాదు బాక్స్‌లు ఏర్పాటు చేశారు.
ప్రజల పక్షాన నిలిచిన ‘సాక్షి’
అభాగ్యులకు ఆర్థికంగా తోడ్పాటు అందేలా కృషి
అధికారులు, పాలకులను కదిలించిన కథనాలు
పేదింటికి పెద్దకష్టం
రామగుండం నగరంలో తండ్రి అనారోగ్యంతో మంచం పట్టగా, స్వీపర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న తల్లికి సాయం చేసేందుకు రాగిజావ విక్రేతగా మారిన బీటెక్ చదివే కూతురు, పేపర్లు వేస్తున్న కుమారిడి దయనీయ పరిస్థితిపై ‘పేదింటికి పెద్దకష్టం’ శీర్షికన ‘సాక్షి’ కథనం ప్రచురించింది. స్పందించిన దాతలు తలాకొంత ఆర్థిక సాయం అందించారు.
అక్షరమే ఆయుధమై..
అక్షరమే ఆయుధమై..
అక్షరమే ఆయుధమై..


