చట్ట పరిధిలోనే వేడుకలు
గోదావరిఖని: జిల్లావాసులు చట్టపరిధిలోనే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా సూచించారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తామన్నారు. మద్యం తాగి పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఇ బ్బందులు కలుగకుండా, ప్రమాదాలకు దూ రంగా, అర్ధరాత్రి 12.30 గంటల్లోపు వేడుకలు ముగించుకోవాలని ఆయన సూచించారు. మ ద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు ప్రభు త్వం అనుమతించిన సమయపాలన పాటించాలని పోలీస్ కమిషనర్ సూచించారు.
జెడ్పీ హైస్కూల్‌కు చేయూత
పెద్దపల్లిరూరల్: అప్పన్నపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు మినరల్ వాటర్ అందించేందుకు ‘మాట’ (మిన్నెసోటా తెలంగాణ అసోసియేష న్) డైరెక్టర్ సమీనారెడ్డి ముందుకొచ్చారు. మా జీ సర్పంచ్ మందల రమాదేవి కూతురైన సమీనారెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. విద్యార్థులకు మినరల్ వాటర్ అందించేందుకు రూ.1.50 ల క్షల వ్యయంతో మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు మందల రమాదేవి, సత్యనారాయణరెడ్డి ఇందుకోసం ఏర్పాట్లు చేశారు.
ఇటుకబట్టీల్లోంచి బడిలోకి..
ధర్మారం(ధర్మపురి): బొమ్మారెడ్డిపల్లి గ్రామ శివారులోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలను ధర్మారం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినట్లు ఎంఈవో ప్రభాకర్ తెలిపారు. మంగళవారం బడిబయట పిల్లల సర్వే చేయగా.. గ్రామ శివారులోని ఇటుకబట్టీల్లో 15 మంది పిల్లలను గుర్తించి స్కూల్‌లో చేర్పించామన్నారు. పిల్లల బాల్యం ఇటుకబట్టీల్లో బందీకా వొద్దని ఆయన సూచించారు. ప్రధానోపాద్యాయుడు మల్లారెడ్డి, క్లస్టర్స్ రిసోర్సు పర్సన్ కొండ కవిత, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం
పెద్దపల్లి: పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. మున్సిపల్ పోరుకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో పురపాలక ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ప్రకటించడంతో ఆదిశగా అధికారులు సర్వం సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు ఉన్నాయి.
గందరగోళం లేకుండా..
గతఎన్నికలకు ముందు వార్డుల విభజన గందరగోళంగా జరిగింది. కాలనీలకు సంబంధం లేనివారిని వార్డు ఓటరు జాబితాలో చేర్చారు. తమకు అనుకూలంగా ఉన్నవారి పేర్లను ఇలా చేర్చానే ఆరోపణలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదు. ఈసారి అలాంటి పొరపాట్లకు తావులేకుండా ఓటరు జాబితా పకడ్బందీగా చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు.. పంచాయతీ ఎన్నికలు పూర్తికావడంతో పట్టణాల్లో ఓట్లు నమోదు చేయించుకునేందుకు ఆశావహులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మరోవైపు.. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఆశావాహులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూశారు. తీరా వారిఆశలు నెరవేరలేదు. ప్రస్తుతం జరిగే మున్సిపల్ పోరులో వార్డులతోపాటు చైర్మన్, వైస్ చైర్మన్ రిజర్వేషన్లు మారనున్నాయని, గతంలో తమకు అనుకూలంగా ఉన్న వార్డులు/డివిజన్లు ఈసారి తమకు అనుకూలిస్తాయో లేదోనని ఆశావాహుల్లో అప్పుడే బెంగ మొదలైంది.
రిజిస్ట్రేషన్ల జోరు
రామగుండం: ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం క్రయ, విక్రయదారులతో రద్దీగా మారింది. ఇటీవల వరుస సెలవులు రావడంతో సోమ, మంగళవారాల్లో క్రయ, విక్రయదారులు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం భారీగా తరలివచ్చారు. రెండు రోజుల్లో సుమారు 45 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ చేశామని ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ తిరుపతినాయక్ తెలిపారు.
చట్ట పరిధిలోనే వేడుకలు


