వర్మికంపోస్ట్ తయారు చేయాలి
సుల్తానాబాద్‌రూరల్: గ్రామాల్లోని సెగ్రిగేషన్ షెడ్లలోనే చెత్త వేసి వర్మికంపోస్టు తయారు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి(డీపీవో) వీరబుచ్చయ్య సూచించారు. దుబ్బపల్లి గ్రామాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. వీధులు, ఇళ్ల నుంచి సేకరించిన తడి, పొడి చెత్తను సెగ్రిగేషన్ షెడ్డుకు తరలించి ఎరువు తయారు చేయాలని ఆయన పేర్కొన్నారు. సర్పంచ్ ఉమ్మెంతల శోభ, ఉపసర్పంచ్ తిప్పారపు రాజయ్య, ఎంపీవో సమ్మిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ప్రత్యూష, సిబ్బంది ఉన్నారు.
ఎన్పీడీసీఎల్ కార్యాలయం తరలింపు
పెద్దపల్లి: జిల్లా కేంద్రంలోని చీకురాయి క్రాస్‌రోడ్డులో గల టీజీ ఎన్పీడీసీఎల్ ఆఫీస్‌ను రాఘవపూర్ సర్కిల్ కార్యాలయానికి తరలిస్తున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ గంగాధర్ మంగళవారం తెలిపారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు ఈప్రక్రియ చేపట్టామని పేర్కొన్నారు. అంతర్గాం సెక్షన్ ఆఫీస్, సుల్తానాబాద్ ఈఆర్వో కార్యాలయాన్ని కూడా సంబంధిత శాఖల భవనాల్లోకి మార్చినట్లు వివరించారు.
నాణ్యమైన విద్యుత్ లక్ష్యం
మంథనిరూరల్: వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యమని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ గంగాధర్ అన్నారు. నాగారం సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో డీఈ ప్రభాకర్, ఏడీ ఈ వెంకటనారాయణ, ఏఈ రాజేశ్ పాల్గొన్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
గోదావరిఖని: సింగరేణి ఆర్థిక స్థితిగతులపై శ్వేతప త్రం విడుదల చేయాలని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు రూ.29వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, ప్ర స్తుతం రూ.47వేల కోట్లకు చేరాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలు వంతపాడుతున్నాయని విమర్శించారు. నా యకులు మాదాసి రాంమూర్తి, చల్లా రవీందర్‌రెడ్డి, పర్లపల్లి రవి, నూనె కొమురయ్య, శ్రీనివాస్‌రావు, శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వర్మికంపోస్ట్ తయారు చేయాలి


