11న ‘చలో వరంగల్’
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): ఈడబ్ల్యూఎస్ రిజర్వేష న్లు పటిష్టంగా అమలు చేయాలని, జాతీయ, రాష్ట్రస్థాయిలో ప్రత్యేక ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో వచ్చే ఏడాది జనవరి 11న వరంగల్ నగరంలో సింహగర్జన సమరభేరి నిర్వహిస్తామని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీ య అధ్యక్షుడు పొలాడి రామారావు అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం ప్రచార పోస్టర్ విడుదల చేసి మాట్లాడారు. ఓసీల్లోనూ అనేకమంది పేద లు ఉన్నారని, ప్రభుత్వ ప్రోత్సాహాకాలు అందడంలేదని తెలిపారు. ఉమ్మడి ఏపీలో సీఎం వైఎస్ రాజ శేఖరెడ్డి.. ఆర్థికంగా, విద్య, వైద్యం పరంగా కొంత ప్రయోజనం చేశారని అన్నారు. నాయకులు వంగళ తిరుపతిరెడ్డి, సతీశ్‌శర్మ, రాఘవులు, కరుణాకర్‌రా వు, రాజేశ్వర్‌రావు, అశోక్, భూమయ్య, వీరారెడ్డి, మాధవరెడ్డి, రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు.


