వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలి
పెద్దపల్లిరూరల్: నూతన సంవత్సర వేడుకలను ప్ర శాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ భూ క్యా రాంరెడ్డి సూచించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను శనివారం ఆయన తనిఖీ చేశారు. ఫిర్యాదులు, కేసు లు, ఇతరత్రా వివరాలపై ఎస్సై లక్ష్మణ్‌రావు, సీఐ ప్రవీణ్‌కుమార్, రూరల్ ఎస్సై మల్లేశ్‌ను అడిగి తెలుసుకున్నారు. హ్యాపీ న్యూఈయర్ అంటూ యువత అర్ధరాత్రి వరకూ రోడ్లపై తిరిగినా, మద్యం మత్తు లో ఇతరుల హక్కులకు భంగం కలిగించినా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఈనెల 31న పోలీసు అధికారులలు తనిఖీ చేస్తాయని అన్నారు.


