కోటీశ్వరులను చేయడమే సర్కార్ లక్ష్యం
ఽదర్మారం(ధర్మపురి): మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి లక్ష్మణ్‌కుమా ర్ అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో మహిళాశక్తి చీరలు పంపిణీచేసి మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిలో మహిళలపాత్ర కీలకమన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో గ్రామీణ మహిళల జీవితాల్లో పెద్దఎత్తున మార్పు వస్తోందని తెలిపారు. మహిళల కోసం ప్రత్యేకంగా స్వయం ఉపాధి శిక్షణ, స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. చిన్నతరహా వ్యాపారాలు ప్రారంభించి కుటుంబాలను ఆర్థికంగా ముందుకు నడిపిస్తుందన్నారు. మహిళలు శక్తిమంతమైతే కుటుంబం ప్రగతిపథలో దూసుకు వెళ్తుందని అభిప్రాయపడ్డారు. పెట్రోల్ బంక్‌లు, సోలార్ ప్రాజెక్టులు, మహిళా క్యాంటీన్‌లు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. ఉచిత బస్సు ప్రయాణం లాంటి అనేక పథకాలు మహిళల కోసం అమలు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో రవీందర్, ఏపీఎం పోచం, మార్కెట్ కమిటీ చైర్మన్ లావుడ్య రూప్లానాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, తహసీల్దర్ ఉదయ్‌కుమార్, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


