చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేదిలేదు
గోదావరిఖని: చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పా ల్పడితే ఉపేక్షించబోమని పెద్దపల్లి డీసీపీ బుక్యా రాంరెడ్డి హెచ్చరించారు. గోదావరిఖని పోలీస్‌స్టేషన్‌ను డీసీపీ రాంరెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బాధితులతో మర్యాదగా వ్యవహరిస్తూ ఫిర్యాదుల సమస్య సత్వరమే పరిష్కరించాలన్నారు. అనంతరం పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు, అత్యధికంగా నమోదయ్యే నేరాలు, రౌడీషీటర్లు, అనుమానితులపై వివరాల గురించి ఆరా తీశారు. ఆయన వెంట ఏసీపీ రమేశ్, సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు భీమేశ్, రమేశ్, అనూష ఉన్నారు. అనంతరం గోదావరిఖని ఏసీపీ కార్యాలయాన్ని డీసీపీ సందర్శించారు.
టీచర్లకు ‘టెట్’ భయం
పెద్దపల్లి: ఊహించినట్లుగానే టీచర్లకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) భయం పట్టుకుంది. ప్రతీఒక్కరు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సిందేనని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు ఇచ్చిన విషయం విదితమే. ఇన్‌సర్వీస్ టీచర్లు కూడా తప్పనిసరిగా టెట్ రాయాల్సిందేనని రాష్ట్రప్రభుత్వం కూడా తాజాగా జారీచేసిన నోటిఫికేషన్‌లో స్పష్టత ఇచ్చింది. దీంతో టెట్ అర్హత లేని జిల్లాలోని మెజారిటీ ఉపాధ్యాయులు ప్రభుత్వ నిర్ణయంతో కలవర పడుతున్నారు. టెట్‌కు హాజరయ్యే వారికోసం దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరిలో పరీక్ష నిర్వహించనున్నారు. జిల్లాలో 1985 నుంచి డీఎస్సీ–2024 వరకు నియమితులైన ఉపాధ్యాయులు సుమారు 2వేల మంది వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 1,982 టెట్ అర్హత సాధించిన వారు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. మిగతావారు టెట్ అర్హత సాధించాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి.
యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై అవగాహన
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(సిమ్స్–ప్రభుత్వ)లో సోమవారం ప్రపంచ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌పై అవగాహన కల్పించారు. జీజీహెచ్ వైద్యులు, సిమ్స్ ప్రొఫెసర్లు, మెడికోలు పాల్గొన్నారు. సిమ్స్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ నరేందర్, జీజీహెచ్ మెడికల్ సూపరింటెండెంట్ దయాళ్‌సింగ్, వైస్ ప్రిన్సిపాల్ లావణ్య, మైక్రోబయాలజీ విభా గం హెచ్‌వోడీ ఓబులేశు మాట్లాడుతూ, సమాజం యాంటీ బయాటిక్స్‌ను బాధ్యతగా వినియోగిస్తేనే రెసిస్టెన్స్ తగ్గించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎంవోలు కపాబాయి, రాజు, అసిస్టెంట్ ప్రొఫె సర్లు హర్షిణి, అనుష, సల్మా, కల్పన, మనస్వి, నర్సింగ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.
చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఉపేక్షించేదిలేదు


