సమస్యలు పరిష్కరించాలి
పెద్దపల్లి: అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ వేణు ఆదేశించారు. కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి ద్వా రా ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి మాట్లాడారు. ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.
ఈ శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి
అర్హులైన కార్మికులు ఈ శ్రమ్ పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని అదనపు కలెక్టర్ వేణు సూచించారు. కార్మిక సామాజిక భద్రత పథకాలపై ఆయన అవగాహన కల్పించారు. వివరాల కోసం పెద్దపల్లి 94925 55258, మంథని 94925 55248, గోదావరిఖని 94925 55284 నంబర్లలోని సహాయ కార్మిక అధికారులను సంప్రదించాలని ఆయన కోరారు.
విధుల బహిష్కరణ
పెద్దపల్లి: ఎమ్మెల్యే విజయరమణారావు తమ పై దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణతో సు ల్తానాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిష్కరించి నిరసన తె లిపారు. కోర్టు సముదాయంలోనే జిల్లా కోర్టు ఏర్పాటు చేయాలని పెద్దపల్లి ఎమ్మెల్యేకు విన్నవిస్తే అవమానించారని ఆరోపించారు. ప్రతినిధులు తిరుపతిరెడ్డి, భూమయ్య, మాడూరి ఆంజనేయులు, పడాల శ్రీరాములు, ఆవునూ రి సత్యనారాయణ, జోగుల రమేశ్, రుద్రారపు నర్సయ్య, మల్యాల కరుణాకర్, గుడ్ల వెంకటే శ్, శివకృష్ణ, రవికిరణ్, పృథ్వీకృష్ణ, యుగేందర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, స్నేహ పాల్గొన్నారు.
జడ్జితో విచారణ జరపండి
పెద్దపల్లి: ఆంధ్రప్రదేశ్‌లోని మారేడుమిల్లి, రంపచోడవరంలో జరిగిన మావోయిస్టు అగ్రనేత హిడ్మా తదితరుల ఎన్‌కౌంటర్‌పై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద సోమవారం నిరసన తెలిపా రు. రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యద ర్శి వెల్తురు సదానందం మాట్లాడుతూ హిడ్మా సహా పలువురు మావోయిస్ట్‌లను పోలీసులు విజయవాడ అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురిచేసి హత్యచేసి ఎన్‌కౌంటర్‌గా చిత్రీకరించారన్నారు. రత్నకుమార్, కృష్ణస్వామి, మామిడిపల్లి బాపయ్య, బాలసాని రాజయ్య, గుమ్మడి కొమురయ్య, గాండ్ల మల్లేశం, గుండవేనా స్వామి, రాంచంద్రం, బుద్ధుల రమేశ్, రవి, మల్లేశ్, సాయికుమార్ పాల్గొన్నారు.
పొజిషన్ సర్టిఫికెట్ అందజేత
ధర్మారం(ధర్మపురి): నందిమేడారం జూనియ ర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణం కోసం ప్ర భుత్వం కేటాయించిన రెండెకరాల పొజిషన్ స ర్టిఫికెట్‌ను ఇన్‌చారర్జి తహసీల్దార్ ఉదయ్‌కుమార్ సోమవారం జడ్జి మట్ట సరితకు అందజేశారు. అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లింగారెడ్డి, సభ్యుల సమక్షంలో జ డ్జికి సర్టిఫికెట్ అందించారు. ప్రతినిధులు ఈదు ల ప్రదీప్‌రెడ్డి, నారా అశోక్‌రెడ్డి, బొట్ల సత్యనారయణ, ఆకారి రాజేశం, సంపత్ పాల్గొన్నారు.
జిల్లా విద్యాధికారిగా శారద
పెద్దపల్లి: జిల్లా విద్యాశాఖ అధికారి(డీఈవో) గా శారదను నియమించారు. ఈమేరకు స్కూ ల్ డైరెక్టర్ మదన్మోహన్ సోమవారం ఉత్తర్వు లు జారీచేశారు. అంతకుముందు డీఈవోగా పనిచేసిన మాధవి సెలవుపై వెళ్లారు. ఈ సందర్భంగా డీఈవోను పలువురు సన్మానించారు.
నేడు హరీశ్‌రావు పర్యటన
ఓదెల(పెద్దపల్లి): మానేరులో శుక్రవారం రాత్రి పేల్చివేతకు గురైన చెక్‌డ్యాంను మాజీమంత్రి హరీశ్‌రావు మంగళవారం పరిశీలించనున్నట్లు సమాచారం. చెక్‌డ్యాం పేల్చివేతతో రైతులకు జరిగే నష్టాన్ని ఆయన అంచనా వేస్తారు.
సమస్యలు పరిష్కరించాలి
సమస్యలు పరిష్కరించాలి
సమస్యలు పరిష్కరించాలి
సమస్యలు పరిష్కరించాలి


