‘బీసీ’.. ఆశలకు గండి
జిల్లాలో భారీగా తగ్గిన స్థానాలు ఖరారైన పంచాయతీ రిజర్వేషన్లు సగం సీట్లు మహిళలకు కేటాయింపు రేపో, మాపో ఎన్నికల నోటిఫికేషన్ పల్లెలు, పార్టీల్లో మొదలైన ఎన్నికల హడావుడి
సాక్షి పెద్దపల్లి: గత ఎన్నికల సమయంలోని రిజర్వేషన్ సౌకర్యం ఈసారి మారింది. రొటేషన్ పద్ధతిలో బీసీ డెడికేషన్ నివేదిక ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేశారు. ఇటీవల 42శాతం రిజర్వేషన్లు ప్రకటించగా 110 స్థానాలు రిజర్వ్ చేశారు. తాజాగా సోమవారం ఖరారు చేసిన రిజర్వేషన్లతో 42 సీట్లు తగ్గాయి. మొత్తంగా 26.15శాతం రిజర్వేషన్ శాతంతో 68 స్థానాలతో బీసీలు సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దీంతో బీసీ నేతల్లో నైరాశ్యం నెలకొంది. మరోపక్క.. బీసీ స్థానాలు తగ్గాగా, జనరల్ స్థానాలు పెరిగాయి. పార్టీపరంగా 42శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తూ అన్ని పార్టీలు బీసీలకు అవకాశాలు కల్పించాలని బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
రాజకీయ పార్టీల కసరత్తు
వివిధ రాజకీయ పార్టీలు సర్పంచ్ ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి. పార్టీ రహితంగా నిర్వహించే ఎన్నికలే అయినా.. పార్టీల మద్దతుతో అభ్యర్థులను బరిలో నిలిపేంఉదకు యత్నిస్తున్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీలు తమ మద్దతుదారుల విజయానికి ప్రణాళిక రూపొందిస్తున్నాయి. అధికార పార్టీ ప్రజల్లోకి వెళ్లి సర్కార్ చేపట్టే సంక్షేమ పథకాలను వివరించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించడంలో బీజేపీ, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ బీఆర్‌ఎస్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి.
2025, 2019 ఎన్నికల సమాచారం
(బ్రాకెట్ అంకెలు శాతంలో)
2025 2019
పంచాయతీలు 263 263
గిరిజన గ్రామాలు 03 03
ఎస్టీ 03(1.15) 5(1.92)
ఎస్సీ 54(20.76) 55(21.15)
బీసీ 68(26.15) 70(26.92)
జనరల్ 135(51.92) 130(50)
మండలాల వారీగా రిజర్వేషన్లు
రిజర్వేషన్ల లెక్క తేలింది
పెద్దపల్లిరూరల్: పంచాయతీ పోరుకు జిల్లా అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. జిల్లాలోని 263 పంచాయతీలు, 2,432 వార్డు స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికనే తీసుకున్నారు. ఈప్రక్రియ కలెక్టరేట్‌లో సోమవారం తెల్లవారు జామున పూర్తయ్యింది. సర్పంచ్ స్థానాల రిజర్వేషన్లను ఆర్డీవోలు, వార్డు స్థానాలను ఎంపీడీవోలు ఖరారు చేశారు. రిజర్వేషన్లన్నీ 50శాతానికి మించకుండా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అధికారులు రిజర్వే చేశారు.
263 పంచాయతీలు.. 2,432 వార్డులు
జిల్లాలో 263 గ్రామ పంచాయతీలుండగా 2,432 వార్డులు ఉన్నాయి. జిల్లా ఓటర్లు 4,04,181 మంది ఉండగా, అందులో 2,05,439 మంది మహిళలు, 1,98,728 మంది పురుషులు, 14 మంది ఇతరులు ఉన్నారు. 263 సర్పంచ్ స్థానాల్లో 134 జనరల్ కేటగిరీకి రిజర్వు కాగా, 69 స్థానాలు బీసీలు, 54 ఎస్సీలు, 6 పంచాయతీలు ఎస్టీలకు కేటాయించారు. అలాగే వార్డు సభ్యుల విషయానికొస్తే.. జనరల్ కేటగిరీకి 1,205 వార్డులు రిజర్వు కాగా.. బీసీలకు 689, ఎస్సీలకు 484, ఎస్టీలకు 54 వార్డులు రిజర్వు అయ్యాయి.
మండలం ఎస్టీ ఎస్సీ బీసీ జనరల్
అంతర్గాం 0 4 3 8
ధర్మారం 3 6 6 14
ఎలిగేడు 0 3 3 6
జూలపల్లి 0 3 3 7
కమాన్‌పూర్ 0 1 3 5
మంథని 1 10 6 18
ముత్తారం 0 2 5 8
ఓదెల 1 3 6 12
పాలకుర్తి 1 4 3 8
పెద్దపల్లి 0 6 9 15
రామగిరి 0 3 5 8
శ్రీరాంపూర్ 0 4 8 12
సుల్తానాబాద్ 0 5 8 14


