బుధవారంపేటను స్వాధీనం చేసుకోవాలి
రామగిరి(మంథని): తమ గ్రామాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటనే సింగరేణి ఓసీపీకి సహకరిస్తామని బుధవారంపేట(రామయ్యపల్లి) వాసులు తెల్చిచెప్పారు. ఈమేరకు మంథని పర్యటనలో ఉన్న కలెక్టర్ కోయ శ్రీహర్షను సోమవారం కలిసి వినతిపత్రం అందజేశారు. గతంలోనే 708 ఎకరాలకు బుధవారంపేట, రాజాపూర్‌లో అవార్డుపాస్ చేసి తీరని అన్యాయం చేసిన సింగరేణి మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మళ్లీ 88 ఎకరాల సేకరణ అని చెప్పి 448 ఎకరాలు సేకరిస్తామంటున్నారని ఆరోపించారు. వ్యవసాయ భూములు సేకరించి, ఇళ్లను వదిలేస్తే తాము బతికేదెలా అని ప్రశ్నించారు. గ్రామస్తులు ఆరెల్లి కొమురయ్యగౌడ్, బుద్దార్థి బుచ్చయ్య, పూదరి శ్రీనివాస్, పొనంపల్లి రవి, మడిపల్లి వెంకటేశం, ఆరెల్లి మహేందర్‌గౌడ్, దాడి శ్రావణ్, అబిలష్ తదితరులు పాల్గొన్నారు.


