కాంగ్రెస్ చేతల ప్రభుత్వం
పెద్దపల్లి: తమది మాటల ప్రభుత్వం కాదని చేతుల ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. స్థానిక స్వరూప గార్డెన్స్‌లో మహిళలకు సోమవారం ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేశారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, పెద్దపల్లి, రామగుండం ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్ రాజ్‌ఠాకూర్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ, 2047 తెలంగాణ రైసింగ్ పాలసీలో భాగంగా మహిళలను మహిళా పారిశ్రామిక వేత్తలు తీర్చి దిద్ది కోటీశ్వరులను చేయడం కాంగ్రెస్ లక్ష్యమన్నా రు. కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యేలు విజయరమణారా వు, మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మాట్లాడారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, ఆర్డీవో గంగయ్య, డీఆర్డీవో కాళిందిని, తహసీల్దార్ రాజ య్య, ఎంపీడీవో శ్రీనివాస్, మహిళా సంఘం అధ్యక్షురాలు స్నేహలత, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.
స్వయం ఉపాధి ద్వారా ఆర్థికాభివృద్ధి
మంథని/మంథనిరూరల్: మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చే స్తోదంని, ఇందులో భాగంగానే స్వయం ఉపాధి క ల్పనకు కుట్టుశిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పేషెంట్లకు అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం ఎక్లాస్‌పూర్ రైతువేదిక వద్ద ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్యగౌడ్, డీసీహెచ్‌ఎస్ శ్రీధర్, మంథని ఆర్డీవో సు రేశ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఆస్పత్రి సూ పరింటెండెంట్ రాజశేఖర్, విద్యుత్ నియంత్రణ మండలి సభ్యుడు శశిభూషణ్ కాచే, ఏఎంసీ చైర్మన్ వెంకన్న, విండో చైర్మన్ శ్రీనివాస పాల్గొన్నారు.


