
పనులు పూర్తిచేయాలి
సుల్తానాబాద్(పెద్దపల్లి): షెట్టర్ నిర్మాణాలను నెలరోజుల్లో పూర్తిచేయాలని ఎమ్మెల్యే విజయరమణారావు సూచించారు. కాల్వశ్రీరాంపూర్ క్రాస్‌రోడ్డులో రూ.65 లక్షలతో చేపట్టిన షెట్టర్ నిర్మాణాలను ఆయన పరిశీలించి పలు సూచనలుచేశారు. చౌరస్తా సుందరీకరణకు అందరూ సహకరించాలని కోరారు. ఈసందర్భంగా నవ తెలంగాణ పబ్లిషింగ్ హౌస్ పుస్తక ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, నాయకులు దాన్నాయక దామోదర్‌రావు, గాజుల రాజమల్లు, అబ్బయ్యగౌడ్, చి లుక సతీశ్, శ్రీగిరి శ్రీనివాస్, కిశోర్, సత్యంగౌ డ్, మొండయ్య, సతీశ్, లక్ష్మణ్ పాల్గొన్నారు.
టీబీ రహిత గ్రామాలు లక్ష్యం
ముత్తారం(మంథని): టీబీ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని టీబీ అలర్ట్ ఇండియా ప్రోగ్రాం జిల్లా అధికారి శ్రీనివాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. టీబీని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నయం చేయవచ్చన్నారు. ప్రతీఆరోగ్య కేంద్రంలో టీబీ నివారణ మందులు ఉ చితంగా లభిస్తున్నాయని తెలిపారు. టీబీపై అవగాహన కల్పించాలని వైద్యుడు అమరేందర్‌రావు, వైద్య సిబ్బందికి ఆయన సూచించారు.
‘హత్యాకాండ ఆపేయాలి ’
జ్యోతినగర్(రామగుండం): అటవీసంపదను కాపాడుతున్న ఆదివాసీలను ఆపరేషన్ కగార్ పేరిట చంపవద్దని, ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని తె లంగాణ రైతు సమస్యల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడిమడుగుల మల్లన్న, సమతా సైనిక దళ్ నాయకుడు దుర్గం నగేశ్ డిమాండ్ చేశారు. స్థానిక మేడిపల్లి సెంటర్‌లో ఆదివాసీ హక్కులు– కార్పొరేటీకరణ కగార్ హత్యాకాండ కాల్పుల విరమణపై ముద్రించిన పోస్టర్లను మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. మా వోయిస్టులతో శాంతిచర్చలు జరపాలనే డి మాండ్‌తో ఈనెల 24న హన్మకొండలో బహిరంగసభ నిర్వహిస్తామని తెలిపారు. రామటెంకి మల్లేశ్, జనగామ రాజన్న, చీమల ఆనంద్, జిమ్మిడి అశోక్, గూడూరు లవన్ కుమార్, మ హేశ్, లింగయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు టీబీజీకేఎస్ సమావేశం
గోదావరిఖని: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) కేంద్ర కార్యవర్గ సమావేశం బుధవారం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నట్లు అధికార ప్రతినిధి పర్లపల్లి రవి తెలిపారు. సింగరేణి కార్మికుల సమస్యలు, గుర్తింపు, ప్రాతి నిధ్య సంఘాల వైఫల్యం, సంస్థ, ఉద్యోగుల భవిష్యత్‌పై చర్చించి పోరుబాటకు కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.
కొనసాగుతున్న కూల్చివేతలు
గోదావరిఖని: స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవనం ఎ దుట గల పోచమ్మ మైదాన్‌లోని కట్టడాల కూ ల్చివేత మంగళవారం కూడా కొనసాగింది. త మ సామగ్రి షాపుల్లోనే ఉందని, కూల్చివేత ఆ పాలని స్థానికులు ఆందోళనకు దిగారు. సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఆందో ళనకారులను పక్కకు తీసుకెళ్లారు. సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది కూడా పాల్గొంది. పోచ మ్మ మైదానంలోని వివాదాస్పద 39 గుంటల సింగరేణి స్థలానికి సంబంధించి రెవెన్యూ అధికారులు సోమవారమే సర్వే చేశారు. నివేదికను కోర్టుకు సమర్పిస్తామని వెల్లడించారు.
22న జాబ్‌మేళా
పెద్దపల్లిరూరల్: మెడ్‌ప్లస్‌లో ఉద్యోగావకాశాల భర్తీకి ఈనెల 22న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎంప్లాయిమెంట్ ఇన్‌చార్జి అధికారి తిరుపతిరావు తెలిపారు. 40 ఫార్మసిస్టు, 20 కస్టమ్ సేల్స్ అసోసియేట్, 30 స్టాక్ పికింగ్, ప్యాకింగ్, 30 ఆడిట్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నా యని తెలిపారు. వివరాలకు 93923 10323, 89853 36947లో సంప్రదించాలని కోరారు.

పనులు పూర్తిచేయాలి

పనులు పూర్తిచేయాలి

పనులు పూర్తిచేయాలి