ఆగని ముసురువాన | - | Sakshi
Sakshi News home page

ఆగని ముసురువాన

Aug 20 2025 5:13 AM | Updated on Aug 20 2025 5:13 AM

ఆగని

ఆగని ముసురువాన

జిల్లాకు జలకళ

నిండుకుండల్లా చెరువులు

ఉధృత‘ధార’తో జలపాతం

పెద్దపల్లిరూరల్‌: జిల్లాలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండి జలకళ సంతరించుకున్నాయి. మారెడుగొండ చెరువు మత్తడి దూకుతోంది. పెద్దబొంకూర్‌ వద్ద హుస్సేనిమియా వాగు ప్రవాహం పెరిగింది. రాగినేడు మత్తడి వద్ద చేపలు కొట్టుకుపోకుండా మత్స్యకారులు జాలీ ఏర్పాటు చే శారు. పెద్దకల్వల, భోజన్నచెరువు, చీకురాయి మ ల్లారెడ్డి చెరువు.. ఇలా జలవనరులన్నీ నిండుకుండ ల్లా మారుతున్నాయి. అదేవిధంగా సబ్బితం శివారు లోని గౌరీగుండాలు జలపాతం ఉధృతమైన జలధా రగా పోస్తోంది. రాఘవాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌ ఆవరణ వరదనీటితో నిండి చెరువును తలపించింది. విద్యార్థులు మోకాలిలోతు నీటిలో బిక్కుబి క్కుమంటూ తరగతులకు వెళ్లాల్సి వచ్చింది. జిల్లాలో అత్యధికంగా అంతర్గాంలో 41.7 మి.మీ., అత్యల్పంగా సుల్తానాబాద్‌ మండలంలో 3.7 మి. మీ. వర్షపాతం నమోదైనట్లు ముఖ్యప్రణాళికశాఖ ఇన్‌చార్జి అధికారి రవీందర్‌ తెలిపారు.

ఓసీపీల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

గోదావరిఖని: రామగుండం రీజియన్‌లోని ఓసీపీ ల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఆర్జీ–1 ఏరియా లోని జీడీకే–5 ఓసీపీ, ఆర్జీ–2 ఏరియాలోని ఓసీ పీ–3, ఆర్జీ–3 ఏరియాలోని ఓసీపీ–1, 2లో హాలేజీ రోడ్లు జలమయం అయ్యాయి. బొగ్గు ఉత్పత్తితో పాటు ఓబీ వెలికితీ పనులు నిలిచిపోయాయి.

మంగళవారం నమోదైన వర్షపాతం (మి.మీ.లలో)

ప్రాంతం వర్షపాతం

సరాసరి 15.6

ధర్మారం 21.3

పాలకుర్తి 25.9

రామగుండం 10.0

రామగిరి 13.8

కమాన్‌పూర్‌ 13.4

పెద్దపల్లి 18.1

జూలపల్లి 10.2

ఎలిగేడు 7.7

ఓదెల 16.6

శ్రీరాంపూర్‌ 11.7

ముత్తారం 10.8

మంథని 14.0

ఆగని ముసురువాన1
1/1

ఆగని ముసురువాన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement