
గోదావరి వరదలపై కలెక్టర్ సమీక్ష
● రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో పర్యటన ● లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన
రామగుండం: ఎగువన ఉన్న శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో వరదనీరు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వచ్చి చేరుతోంది. దీంతో ప్రా జెక్టు 35 గేట్లు ఎత్తి దిగువన ఉన్న గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష మంగళవారం ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. వరద ఉధృతిపై అధికారులతో సమీక్షించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన సూచించారు. పశువులు, గొ ర్రెలకాపరులు, మత్స్యకారులు నదిలోకి వెళ్లొద్దని అ న్నారు. చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ సత్యనారాయణ, డీఈ బుచ్చిబాబు, శరత్‌బాబు, తహసీల్దార్ ఈశ్వర్ పాల్గొన్నారు.
ముంపు ప్రాంతాల పరిశీలన
జ్యోతినగర్(రామగుండం): వరద ముంపు గ్రామాలైన మల్కాపూర్, రామయ్యపల్లెలో కలెక్టర్ పర్యటించారు. ముంపు, లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఈ సుధాకర్‌రెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ, డీఈ బుచ్చిబాబు, శరత్‌బాబు, తహసీల్దార్ ఈశ్వర్, ఈఈ రా మన్, డీసీసీ కార్యదర్శి ఎండీ రహీమ్ పాల్గొన్నారు.