
పేదలకు ఇళ్లు కట్టిస్తాం
ధర్మారం(ధర్మపురి): స్థోమతలేని పేదలకు తానే ద గ్గరుండి ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అభయం ఇచ్చారు. స్థానిక మండల పరిష త్ కార్యాలయంలో మంగళవారం 23 మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.23,26,006తోపాటు 121 మందికి సీఎంఆర్‌ఎఫ్‌కు సంబంధించి రూ. 41,63,500 విలువైన చెక్కులను మంత్రి పంపిణీ చేసి మాట్లాడారు. అర్హులైనవారందరికీ దశలవారీ గా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రా జకీయ జన్మనిచ్చిన ధర్మారం మండలంలోని ప్రతీపేదకు ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ ఒక్క రేషన్‌కార్డు కూడా అందించలే దని ఆరోపించారు. నాయకులు లావుడ్య రూప్లానాయక్, అరిగే లింగయ్య, కొడారి అంజయ్య, కొత్త న ర్సింహులు, తిరుపతిరెడ్డి, అధికారులు ఉన్నారు.