
చిల్లపల్లి కార్యదర్శికి సన్మానం
పెద్దపల్లిరూరల్/మంథనిరూరల్: గతేడాది జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డు అందుకున్న మంథని మండ లం చిల్లపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాంకిశోర్‌ను భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ, పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి సన్మానించా రు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో చిల్లపల్లి సెక్రటరీతోపాటు రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన మరో ఐదుగురు కార్యదర్శులను సత్కరించారు. వీరితోపాటు పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య ఆగస్టు 15న న్యూఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరుకానున్నారు. సర్పంచులు లేకపోవడంతో వారి స్థానంలో పంచాయతీ కార్యదర్శులను ఆహ్వానించారు.
నేడు ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలకు హాజరు